వివాహేతర సంబంధాల్లో పురుషులను దోషులుగా.. మహిళను బాధితురాలిగా పరిగణిస్తూ రూపొందిన చట్టాన్ని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటలీకి చెందిన భారత సంతతి జోసెఫ్ సైన్ ఇందుకు సంబంధించి పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేసాడు. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ ల కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
ఏ వివాహిత మహిళ ఆయన భర్త అనుమతి లేకుండా మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 497 ప్రకారం.. అది వ్యభిచారం కింద వస్తుంది. ఈ కేసులో పురుషుడికి శిక్ష విధిస్తారు. మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. సమానత్వపు హక్కు, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని కేసు వేశాడు. భర్త అనుమతి లేకుండా భార్య శృంగారంలో పాల్గొన్నప్పుడు సదరు వ్యక్తితో పాటు ఆమెకూ శిక్ష ఖరారుచేయాలని సదరు పిటీషనర్ ఉద్దేశం.