నిజంగా ఆ చింపాంజీ అదృష్టవంతురాలు. కోవిడ్ 19 నిబంధలున్నా సరే హ్యాపీ బర్త్ డే ఘనంగా జరుపుకుంది. అది కూడా అధికారికంగా. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే చూడండి మీరు కూడా.
జంతువులకు పుట్టినరోజు సంబరాలు జరపడం కొత్తేమీ కాదు. అయితే ఇది మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆ జంతువు పెంపుడు జంతువు కాదు. ఇదొక చింపాంజీ మరి. పేరు సుజీ. 2011లో దీన్ని సహారా గ్రూప్ సంస్థ హైదరాబాద్ జూకు బహుమానంగా ఇచ్చింది. అప్పట్నించి సుజీ వీరికి చాలా ప్రత్యేకం. సుజీకు జూలై 15 పుట్టినరోజు. 34వ బర్త్ డే జరుపుకుంటోంది.
ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలు, లాక్ డౌన్ నేపధ్యమున్నా సరే సుజీకు బర్త్ డే ప్రత్యేకంగా మారింది. అందరికీ విందు ఏర్పాటు చేయలేకపోయినా సుజీకు ఇష్టమైనవాటిని మాత్రం రప్పించారు.
సుజీ బర్త్ డే కేక్ ను కూడా ప్రత్యేకంగా చింపాంజీకు ఇష్టమైన పండ్లు, వెజిటెబుల్స్ తో ఫ్రూట్ కేక్ తయారు చేయించారు. బర్త్ డే ప్రాంతాన్ని కూడా పూలతో, కూరగాయలతో, పండ్లతో చక్కగా అలంకరించారు.
హైదరాబాద్ జూలో సుజీ బర్త్ డే అందుకే ఇప్పుడు చాలా ప్రత్యేకంగా మారింది. హ్యాపీ బర్త్ డే సుజీ Also read: TS Secretariat: కూల్చివేతపై మళ్లీ నిరాశే