Heavy rain in TS and AP: హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచన విషయానికొస్తే.. తెలంగాణలో నైరుతి రుతు పవనాలు ( Monsoon ) చురుకుగా కదులుతుండగా, మరో వైపు ఒడిషా నుంచి కోస్తాంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ( Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్లో మరో వ్యాధి కలకలం )
తెలంగాణలో (Telangana ) నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు ( Heavy rain ) కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ( Also read: Telangana: సచివాలయం కూల్చివేతపై 15వరకు స్టే )
కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోనూ నేడు, రేపు, ఎల్లుండి.. మూడు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ( Also read: Doctor on Tractor: కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లిన డాక్టర్ )