సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చాలా పనులకు మనుషులతో పని లేకుండా పోతోంది. ఇంకా చెప్పాలంటే అంతా యాంత్రికమయం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..AI దీన్ని సుసాధ్యం చేసి చూపిస్తోంది. రానున్న రోజుల్లో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.
ఇప్పుడు సాంకేతిక విప్లవం న్యూస్ రూమ్‌లోకి కూడా ప్రవేశించింది. సాధారణంగా వార్తలు చదివేందుకు న్యూస్ రూమ్‌లో యాంకర్లు ఉంటారు. కానీ రానున్న రోజుల్లో రోబోలే వార్తలు చదువుతాయి. అవును.. చైనాకు చెందిన జిన్హువా, సెర్చ్ ఇంజిన్ సాగో సంయుక్తంగా 3డీ న్యూస్ యాంకర్‌ను డిజైన్ చేశాయి.
కొత్తగా తయారు చేసిన ఈ 3డీ రోబోకు జిన్ జియావోయి అని పేరు పెట్టారు. మనుషుల గొంతును అనుకరించడం దీని ప్రత్యేకత. అంతే కాదు వార్తలకు అనుగుణంగా ముఖ కవలికలను కూడా ఇది మార్పు చేయగలదు. అదే విధంగా పెదవులను కూడా కదిలించగలదు. టీవీ యాంకర్లు చేసినట్లే తన శరీరాన్ని కదిలించడం దీని ప్రత్యేకత. అంటే మొత్తంగా చెప్పాలంటే.. అచ్చం టీవీ యాంకర్లు ఎలా ఉంటారో అలాగే ఈ 3డీ రోబో నడుచుకోగలదు. ప్రేక్షకులకు ఈ రోబో వార్తలు చదువుతున్నప్పుడు ఎక్కడా అనుమానం కూడా రాని విధంగా ఉంటుందన్నమాట.
3డీ రోబో పని తీరును వివరించే ఫుటేజీని రెండు కంపెనీలు విడుదల చేశాయి. ఇందులో అచ్చంగా న్యూస్ యాంకర్ల తీరుగానే 3డీ రోబో కదలికలు, ముఖ కవలికలు కనిపిస్తున్నాయి.
Here comes Xin Xiaowei, the world's first 3D #AINewsAnchor.
Jointly developed by Sogou and Xinhua News Agency, she will report for Xinhua News Agency on the #TwoSessions, creating a new and dynamic viewing experience. pic.twitter.com/5Tok2Mm3Pl— Sogou Inc. (@Sogou_Inc) May 21, 2020
నిజానికి 2018లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..AIతో తొలి యాంకర్ ను లాంచ్ చేశారు. కానీ అప్పట్లో 2డీ న్యూస్ రీడర్‌ను మాత్రమే లాంచ్ చేశారు. ఇప్పుడు 3డీ న్యూస్ యాంకర్‌ను ప్రవేశ పెట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ ఘనత చైనా కంపెనీలకే దక్కింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..