ముంబై: చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtra CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన తన మౌత్ పీస్ 'సామ్నా' లో ఓ సంపాదకీయ కథనాన్ని ప్రచురించింది. చైనా నుంచి మొదటిగా వచ్చిన 20 లక్షల టెస్టింగ్ కిట్స్ ఉపయోగం లేకుండా లోపంతో ఉన్నాయి కదా అని సామ్నా సంపాదకీయ కథనం కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
Also read : Baby girl died: కరోనాతో 6నెలల పసికందు మృతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్‌ను 'చైనీస్ వైరస్' అని పిలుస్తుంటే.. మరోవైపు భారత్ మాత్రం టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో చైనానే ఎందుకు ఎంచురుందో అర్థం కావడం లేదని శివసేన విస్మయం వ్యక్తంచేసింది. "సెంటర్ విధానం ప్రకారం, కొరోనావైరస్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో అవసరమైన వస్తుసామాగ్రి కోసం రాష్ట్రాలు కేంద్రంపైనే ఆధారపడాల్సి ఉంది. అయితే, చైనా అందించిన టెస్టింగ్ కిట్స్ మాత్రం తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు లోపభూయిష్టంగా ఉన్నాయి. అటువంటప్పుడు కరోనాపై చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలవడం ఎలా సాధ్యమవుతుందని శివసేన కేంద్రాన్ని ప్రశ్నించింది.
Also read : Telangana: కొత్తగా 27 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం
మోదీ సర్కార్ చైనా నుంచి తెప్పించిన టెస్టింగ్ కిట్స్ పనికిరానివిగా తేలింది. దీంతో చివరకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో చైనా వస్తువులను పక్కనపెట్టి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారు చేసిన కిట్‌లనే ఉపయోగించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చిందని శివసేన అభిప్రాయపడింది.
Also read : EAMCET, ECET exams: ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణపై సర్కార్ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ను 'చైనా వైరస్' అని పిలవడం యాదృచ్చికం కాదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగానే యావత్ ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయింది. చైనా నుండి ప్రపంచం మొత్తానికి వ్యాపించిన కరోనావైరస్ మనిషి సృష్టించిందేనని నోబెల్ గ్రహీతలైన శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇకపై కూడా చైనా ఏమేం చేస్తుందో ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, భారతదేశం వంటి దేశాలు చైనా నుండే కరోనావైరస్ టెస్టింగ్ కిట్స్‌ని భారీ సంఖ్యలో కొనుగోలు చేసి ఆ దేశం ఆర్థికంగా బలోపేతం అవడానికి కృషి చేస్తున్నాం. అందుకే ఇకనైనా చైనా నుండి కొనుగోలు చేసిన మిలియన్లకొద్ది ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ని పక్కనపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివసేన సంపాదకీయ కథనం స్పష్టంచేసింది.
Also read : నా వాహనంలో మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు మంత్రి హరీష్ రావు భరోసా
మహారాష్ట్రకు కేంద్రం నుండి 75,000 చైనీస్ రాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చాయి. ధారావి వంటి కరోనా హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో వాటిని ఉపయోగించడం ప్రారంభమయ్యాయి. కాని అంతలోనే అవి పనికిరావని చెబుతా వాటి వినియోగం ఆపేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే ఉంది. ఇలా అయితే కరోనాపై దేశం ఎలా విజయం సాధిస్తుందని కేంద్రంపై శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
చైనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలు.. కేంద్రంపై శివసేన ఫైర్