కెనడాలో దారుణం జరిగింది. నోవా స్కాటియా ప్రావిన్స్ లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ పోలీసు కూడా మృతి చెందాడు.
నోవా స్కాటియా ప్రావిన్స్ లో 51 ఏళ్ల దుండగుడు గాబ్రియెల్ వార్ట్ మాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపేందు కోసం అతడు పోలీసు యూనిఫామ్ లో వచ్చాడు. కారును కూడా పోలీసు కారులాగే తయారు చేసుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ ఉన్న కారణంగా ఎక్కువ మంది బయటకు రావడం లేదు. కాబట్టి మృతుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అతడు కూడా కాల్పుల్లో చనిపోయినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చెబుతున్నారు. కానీ అధికారికంగా ధృవీకరించడం లేదు. వార్ట్ మాన్ జరిపిన కాల్పుల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ కు చెందిన హైడీ స్టీవెన్సన్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా మృతి చెందారు. మరోవైపు దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వార్ట్ మాన్ గతంలో దంత వైద్యుడుగా పని చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కెనడాలో గన్ కల్చర్ పెరిగినందున పూర్తిగా గన్స్ పై నిషేధం విధించారు. మృతులకు , దుండగునికి మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు. ప్రస్తుతం చనిపోయిన వారి గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
1989 తర్వాత కెనడా చరత్రలో అత్యంత్య హేయమైన ఘటన ఇదే కావడం గమనార్హం. అప్పట్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..