కొత్తగా 66 కరోనా కేసులు.. 766కు చేరిన మొత్తం కేసుల సంఖ్య...

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిరంతరంగా పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కు చేరుకుందని

Last Updated : Apr 18, 2020, 12:58 AM IST
కొత్తగా 66 కరోనా కేసులు.. 766కు చేరిన మొత్తం కేసుల సంఖ్య...

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిరంతరంగా పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 186 మందిని డిశ్ఛార్జ్ చేయగా, 18 మంది మరణించారని, 562 మంది ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Covid-19: మరో ఆరు హాట్ స్పాట్ లను గుర్తించిన ఢిల్లీ...

కాగా కొత్త కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో సూర్యాపేట జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయని, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు సమాచారం అందిందని అన్నారు. మరోవైపు జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 417 కేసులు, నిజామాబాద్ లో 58, రంగారెడ్డిలో 23, వికారాబాద్‌లో 33, వరంగల్ అర్బన్‌లో 25, జోగులాంబ గద్వాల్ లో 19, సూర్యాపేటలో 44, మేడ్చల్‌లో 5, నిర్మల్‌లో 17, కరీంనగర్‌లో 19, నల్లగొండలో 12, ఆదిలాబాద్‌లో 11, మహబూబ్‌నగర్‌లో 11, కామారెడ్డిలో 11, ఖమ్మంలో 7, సంగారెడ్డిలో 7, మెదక్‌లో 5, భద్రాద్రిలో 4, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల్‌లో 3 చొప్పున, నాగర్‌కర్నూల్, ములుగు, జనగాం, పెద్దపల్లి 2 చొప్పున, మహబూబాబాద్, సిద్ధిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News