Tata Ace Pro EV Price: ఆశ్చర్యపోకండి..ఇది ఎలక్ట్రిక్‌ కారు కాదు.. లాజిస్టిక్స్ EV వెహికిల్స్‌..

Tata Ace Pro EV Price: మార్కెట్‌లోకి కొత్త లాజిస్టిక్స్ EV వెహికిల్స్‌ అందుబాటులోకి రాబోతోంది. మొట్ట మొదటిసారి ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

Tata Ace Pro EV Price: టాటా మోటార్స్ తమ కస్టమర్స్‌ బంఫర్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2025లో భాగంగా టాటా కొత్త కొత్త కార్లు, లాజిస్టిక్స్ వెహికిల్స్‌ను పరిచయం చేస్తూ వస్తోంది. గతంలో విడుదల చేసిన  టాటా ఏస్‌ను మరో సారి ఆప్డేట్ వేరియంట్‌లో పరిచయం చేసింది. ఇది  టాటా ఏస్ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో లాంచ్‌ కానుంది. ఈ వెహికిల్స్‌ను సీటీలో వివిధ రకాల వస్తువులను సరఫరా చేసేందుకు రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వెహికిల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

టాటా ఏస్ కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్ ప్రో-వెర్షన్‌లో పరిచయం చేసింది. ఇది 750 కిలోల వరకు బలమైన లోడ్ మోసే సామర్థ్యం కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టాటా ఏస్ ప్రో EV ఎంతో శక్తివంతమైన 14.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.     

2 /5

టాటా ఏస్ ప్రో EV వెహికిల్స్‌లో ప్రత్యేకమైన వెనుక పార్కింగ్ సెన్సార్‌లు లభిస్తున్నాయి. దీనిని సులభంగా డ్రైవ్‌ చేసేందుకు డ్రైవర్‌కు ప్రత్యేకమైన క్యాబిన్‌ సెటప్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వెహికిల్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కూడా అందిస్తోంది.    

3 /5

అలాగే ఈ టాటా ఏస్ ప్రో EV వెహికిల్స్‌ను పార్క్‌ చేసే క్రమంలో వెనకలో ఉన్న ప్రదేశాలను చూసేందుకు ప్రత్యేకమైన కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా దీని డిజైన్‌ గతంలో విడుదల చేసిన టాటా ఏస్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది.   

4 /5

ఈ వెహికిల్స్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సెటప్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన భద్రత ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   

5 /5

టాటా మోటార్స్ ఈ టాటా ఏస్ ప్రో EV వెహికిల్స్‌లో ఎన్నో రకాల ప్రత్యేకమైన భద్రతా ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. రోడ్డ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టాటా ఏస్ ప్రో EV వెహికిల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంపెనీ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.