హైదరాబాద్: కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ రోడ్లమీదకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను సమకూర్చుకుని ఇంట్లోనే ఉంటున్నారు. కానీ దినసరి కూలీలు, యాచకుల పరిస్థితి అలా కాదు. ఈ నేపథ్యంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలలో రూ.5కే ఇప్పటివరకూ అందిస్తున్న భోజనాన్ని లాక్ డౌన్ సమయంలో ఉచితంగా అందించాలని నిర్ణయించారు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
నేటి నుంచి అన్నపూర్ణ కేంద్రాలలో ఉచితంగా భోజనం అందనుంది. లాక్డౌన్ సమయంలో దినసరి కూలీలు, ఇతర కార్మికులెవరూ ఆకలితో ఎవరూ చనిరాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం ఈ నిర్ణయం తీసుకోగా ఆ మరుసటి రోజు నుంచే అమలు చేయడం గమనార్హం. లాక్డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే
హైదరాబాద్ నగరంలో మొత్తం 150 అన్నపూర్ణ భోజన కేంద్రాలలో ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, హరే రామ ఫౌండేషన్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా కొన్నేళ్ల నుంచి అన్నపూర్ణ కేంద్రాలలో రూ.5కే భోజనం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యాంటీ బయాటిక్స్‌తో కరోనాకు చెక్.. అసలు నిజం ఇది
రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను తరిమికొట్టవచ్చని సూచిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..