Telangana Cold Temperature: పగటి ఉష్ణోగ్రతలు కూడా మరింత తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ చలితో వణికిపోతుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులపాటు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే ప్రకటించింది .
తెలంగాణను చలి వణికిస్తోంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది రాత్రి సమయంలో పొగ మంచు కమ్ముకుంటుంది. ముఖ్యంగా ఉదయం 10 అయినా కానీ కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు పేరుకుని ఉంటుంది. ఇలా మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది.
ఈ రెండు రోజులు పలు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. అంటే సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుంది.
ఈనేపథ్యంలో ఇలా సింగల్ డిజిట్‌కు పరిమితం అవుతున్న ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంకా మిగతా జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సంక్రాంతి ముగిసి వారం రోజులు కావస్తున్నా కానీ ఇంకా వాతావరణంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా సంక్రాంతి అయిన తర్వాత చలి తగ్గుతుంది. ఇక ఏపీ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ చలి తీవ్రత కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు పొగ మంచు కమ్మేస్తోంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ద్రోణి వల్లే తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరుగుతోందని చెప్పింది. ఈనేపథ్యంలో ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.