Student Supports to Ex Minister KTR: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ గురువారం హాజరయ్యారు. లీగల్ టీమ్‌కు పర్మిషన్ లేకపోవడంతో ఒంటరిగా హాజరయ్యారు. ఈడీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో కేటీఆర్‌కు ఐదో తరగతి విద్యార్థి బాసటగా నిలిచాడు.
అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న మాణిక్య శ్రీయాన్ రాజ్ అనే విద్యార్థి కేటీఆర్‌కు సపోర్ట్ చేశాడు. కేటీఆర్‌పై ప్రభుత్వం నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఆయన చిత్రాన్ని గీశాడు.
శ్రీయాన్ రాజ్ గీసిన చిత్రాలను కేటీఆర్ టీమ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాగా..హైదరాబాద్‌లో మొదటిసారి రేసు జరిగినప్పుడు శ్రేయాన్ రాజ్ ప్రత్యక్షంగా వీక్షించాడు.
శ్రీయాన్ రాజ్ గీసిన చిత్రాలను కేటీఆర్ టీమ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాగా..హైదరాబాద్‌లో మొదటిసారి రేసు జరిగినప్పుడు శ్రేయాన్ రాజ్ ప్రత్యక్షంగా వీక్షించాడు.
ఇక గురువారం కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో FEMA యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ప్రశ్నించింది.
A2 అరవింద్ కుమార్, A3 బీఎల్ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్లను ముందు ఉంచి విచారించింది. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది. ఈడీ విచారణ అనంతం స్టేట్‌మెంట్ పేపర్లపై కేటీఆర్ సంతకాలు చేశారు.