భోపాల్: దేశంలో బీజేపీ రాజకీయ విలువలను మంటగలుపుతుందని, రాష్ట్రంలో మాఫియాను అరికట్టడం ఇష్టం లేదని, రాష్ట్ర ప్రజలు తమను పరిపాలించడానికి ఐదేళ్లు అవకాశమిచ్చారని కానీ అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉందన్నారు. అయితే కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి పదిహేనేళ్ళు అవకాశమిచ్చారని, వాళ్ల్లు చేయలేనిది తాము 15 నెలల్లోనే చేసి చూపించామని ఇది చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది శాసన సభ్యులను డబ్బులతో కొనుగోలు చేసి బెంగళూరుకు తరలించారని అన్నారు. కాగా శాసన సభలో మధ్యాహ్నం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో తాను రాజీనామా చేయనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు.
Also Read: భారత్లో అయిదో కరోనా మరణం.. ఈసారి ఎక్కడంటే!
అంతకుముందు కమల్ నాధ్ సర్కార్ బలపరీక్షకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన 16మంది ఎంఎల్ఎల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. దీంతో కోర్టు ఆదేశాలతో బలపరీక్ష జరగకముందే కాంగ్రెస్ పతనం అనివార్యంగా కనిపించింది. కమల్ నాథ్ ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు బలం నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: నిర్భయ కేసు దోషుల ఉరిపై స్పందించిన ప్రధాని మోదీ
కాగా మొత్తం 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలోనే మంత్రులుగా ఉండి తిరుగుబాటు చేసిన ఆరుగురి రాజీనామాలను స్వీకర్ ప్రజాపతి ఆమోదించారు. ప్రస్తుతం 16మంది రాజీనామాల ఆమోదంతో అసెంబ్లీలో శాసన సభ్యుల బలం 206కు పడిపోయింది. శాసనసభలో మ్యాజిక్ సంఖ్య 104గా ఉంది. అయితే కాంగ్రెస్ బలం 92కు పడిపోగా, బీజేపీ ఇప్పటికే 107మంది ఎంఎల్ఎల బలం ఉండటంతో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం కావడం ఖాయమంటున్నాయి బీజేపీ వర్గాలు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..