Jobs Recruitment 2025: తెలంగాణ నిరుద్యోగులకు సంక్రాంతి శుభవార్త.. ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల్లో పోస్టులకు భర్తీ.. జీతం ఎంతంటే..

Telangana Medical College Jobs Recruitment 2025: తెలంగాణలోని మెడికల్ కాలేజ్‌ల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.  
 

Telangana Medical College Jobs 2025 Recruitment: తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కార్‌ సంక్రాంతికి ముందే గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తెలంగాణాలో ఉన్న వివిధ జిల్లాలో మెడికల్ కాలేజ్‌ల్లో ఉన్న కొన్ని ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీలను మొదటగా కాంట్రాక్టుతో పాటు అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ మెడికల్ కాలేజ్‌లకు సంబంధించిన సంస్థ నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జోనల్‌తో పాటు జిల్లా కేడర్‌కి సంబంధించిన పోస్టులను చేర్చింది. అయితే ఇప్పటికే ఈ తెలంగాణ మెడికల్ కాలేజ్‌ రిక్రూట్మెంట్‌లో భాగంగా అన్ని వివరాలను క్లుప్తంగా పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన అప్లై తేది వివరాల్లోకి వెళితే.. ఈ ప్రక్రియ జనవరి 17వ తేది నుంచి ప్రారంభమవుతుంది.     

2 /5

ప్రత్యేకమైన నోటిఫికేషన్‌ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ రకాల ఖాళీలను ఫిల్ చేయబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా వార్డ్ బాయ్స్‌ నుంచి థియేటర్ అసిస్టెంట్ , గ్యాస్ ఆపరేటర్‌తో పాటు ల్యాబ్ అటెండెన్ట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలా చాలా ఖాళీకు దరఖాస్తులను కోరినట్లు నోటిఫికేషన్‌లో తెలుస్తోంది.    

3 /5

అలాగే ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్‌తో పాటు CT టెక్నీషియన్, అనస్తీసియా టెక్నీషియన్, ECG టెక్నీషియన్‌ ఖాళీలకు కూడా దరఖాస్తు కోరినట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టుల సంఖ్య 52గా ఉన్నట్లు తెలుస్తోంది.      

4 /5

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సంఖ్యను క్లుప్తంగా పేర్కొంది. ఇక విద్యార్హతల వివరాలు చూస్తే.. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునేవారు తప్పకుండా పోస్టును బట్టి 10th, ఇంటర్, డిగ్రీ పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలను కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది.    

5 /5

ఈ జాబ్స్‌కు సంబంధించిన జీతాలు రూ.15 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇందులో వయస్సు పరిమితిని కూడా పేర్కొంది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునేవారి వయస్సు తప్పకుండా 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ను బట్టి అధారపడి ఉంటుంది.