Redmi K80 Ultra Price: అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనికి సంబంధించిన లాంచింగ్ వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi K80 Ultra Price And Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ (Xiaomi) తమ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్‌న్యూస్ అందించబోతోంది. అతి త్వరలోనే Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. రెడ్మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే విడుదలలో కాస్త జాప్యం జరిగింది. అయితే ఇటీవలే ఈ మొబైల్ డిజైన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ Redmi K80 సిరీస్‌కి సంబంధించిన లీక్ అయిన వివరాల్లోకి వెళితే.. ఈ సిరీస్‌లో Redmi K80 Ultra స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్ఫుల్ MediaTek Dimensity 9400+ చిప్సెటప్లో విడుదల కాబోతోంది. అలాగే దీని ఫ్రంట్ భాగంలో ప్రత్యేకమైన స్క్రీన్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇందులోని స్క్రీన్ ప్రత్యేకమైన బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 1.5K పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన డిజైన్ సెటప్‌లో విడుదల కాబోతోంది.
ఈ Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు ఇటీవలే లీక్ అయిన వివరాల్లో వెల్లడించారు. ఈ మొబైల్ అద్భుతంగా కనిపించేందుకు మెటల్ ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్మూత్ టచ్ డిస్ల్పేతో విడుదల కానుంది.x
ఈ స్మార్ట్‌ఫోన్ టోటల్ IP68 డస్ట్‌తో పాటు వాటర్ రెసిస్టెన్స్‌తో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ధర వివరాలు ఇప్పటికీ కంపెనీ ప్రకటించలేదు. అయితే దీనిని అతి తక్కువ ధరలోనే విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ Redmi K80 అల్ట్రా మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది 6500mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన సిలికాన్-కార్బన్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అలాగే ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.