Rakul Movies: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఈమధ్య తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక కూడా కొన్ని హిందీ సినిమాలలో నటిస్తూ కొనసాగుతోంది హీరోయిన్. ఈ క్రమంలో…గతంలో జరిగిన ఒక సందర్భం గురించి రకుల్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అదేమిటంటే..?
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లో అడుగులు వేసి అక్కడ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు..పూర్తిగా దూరమైంది రకుల్ ప్రీత్ సింగ్.
టాలీవుడ్ లో మహేష్ బాబు ,అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు జోడీగా నటించి తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం ఒక్క హిట్ ను కూడా అందుకోలేక పోతోంది. కేవలం సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో , జిమ్ వీడియోలతో మాత్రమే అభిమానులను అలరిస్తోంది.
ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్.. తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా వివాహం తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే రకుల్ ప్రీతిసింగ్ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ.. తన జీవితంలో నెపోటిజం కారణంగా చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని, సినీ పరిశ్రమలో కూడా ఇది చాలా ఎక్కువగా ఉన్న మాట నిజమే అంటూ తెలిపింది.
కానీ ఇలాంటి వాటి వల్ల అవకాశాలు కోల్పోయినప్పుడు బాధపడలేదని వెల్లడించింది. కానీ తన జీవితంలో ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధపడ్డానని, అది కూడా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన ఎమ్మెస్ ధోని సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఈ సినిమాలో తనని ఎంపిక చేశారని.. రామ్ చరణ్ తో బ్రూస్లీ సినిమాలో నటిస్తున్న సమయంలో.. ఆ సినిమాలో షూటింగ్ ఆలస్యం కావడం చేత.. డేట్లు అడ్జస్ట్ కాలేక ఎమ్మెస్ ధోని సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడించింది.
ఆ సమయంలో ఆ సినిమా వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇందులో ఏ పాత్ర అనే విషయం చెప్పలేదు.. ధోని సినిమాలో సుశాంత్ సింగ్, దిశాపటాని, కియారా అద్వానీ నటించారు.