Almonds: బాదం అతిగా తింటే కలిగే 4 అనర్థాలు ఏంటో తెలుసా?

Almonds Side effects: ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతారు. అయితే ఇందులో ప్రధానంగా బాదం ఎక్కువగా తింటారు. ప్రతి ఒక్కరూ డ్రైఫ్రూట్స్‌ అనగానే బాదం అంటారు. బాదం ఎంత తినాలి? ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకోకపోతే సైడ్‌ఎఫెకట్స్‌ మీ ఆరోగ్యంపై చూపుతుంది.
 

1 /5

వీటిని తీసుకోవడం వల్ల అనేక ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా మన అభిజ్ఞ పని తీరు మెరుగు చేస్తుంది. గుప్పెడు బాదాం గింజలు ప్రతిరోజు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతిరోజు మీరు బాదం ఎంత మోతాదులో తినాలి? ఇది ఎక్కువగా తింటే మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.   

2 /5

బాదం అతిగా తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొంతమందికి అలర్జీ రియాక్షన్ త్వరగా వస్తుంది. బాదం అతిగా తీసుకోవడం వల్ల ఈ లక్షణం త్వరగా బయటపడుతుంది. దురద, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి ఇలా జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  

3 /5

బాదం తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ మోతాదులో బాదం తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి సమస్యలు వస్తాయి. దీంతో గ్యాస్ కూడా పెరుగుతుందో ఒక్కోసారి డయేరియాకు దారితీస్తుంది   

4 /5

బాదంలో ఆక్సలెట్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాదం అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కిడ్నీ స్టోన్స్ తో కూడా బాధపడవచ్చు అందుకే పరిమిత మోతాదులో బాదం తీసుకోవాలి.  

5 /5

 బాదం అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఖనిజాల పుష్కలం అయితే బాదం అతిగా తీసుకోవడం వల్ల ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు సులభంగా పెరిగిపోతారు. నిపుణుల అభిప్రాయం తర్వాత బాదం ప్రతిరోజు తీసుకోవడం నయం.