Sim Cards Linked With Aadhar Card: ఆధార్ కార్డు మన దేశంలో ఏ చిన్న పని పూర్తి చేయాలన్నా తప్పకుండా ఉండాల్సిందే. అయితే, ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఏ బ్యాంకు లావాదేవి లేదా స్కీముకు లాభం పొందాలన్నా ఆధార్ కావాలి. ఈ సందర్భంలో మనం ఎక్కడెక్కడో ఆధార్ కార్డు కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, మన ఆధార్ నంబర్‌తో అనేక మోసపూరిత పనులు చేసే అవకాశం ఉంది. దీంతో మీరు చిక్కుల్లో పడవచ్చు. మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇలా చెక్ చేసుకోండి.
మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయి? దీన్ని సులభంగా మీరు ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీంతో మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నాయి తెలుసుకోవచ్చు. మీ పేరుపై సిమ్ కార్డులు ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి కూడా తెలుసుకోగలుగుతారు.
డీఓటీ నిబంధనల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. సాధారణంగా సిమ్ కార్డులు కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇది గుర్తింపు కార్డులా మన దేశంలో ఉపయోగిస్తారు. అయితే, మీ ఆధార్ కార్డును ఎవరైనా మోసపూరిత పనులకు ఉపయోగిస్తున్నారా? ఇలా తెలుసుకుని జాగ్రత్త పడండి.
సిమ్ కార్డు మోసాలతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్యూనికేషన్ ఓ కొత్త ప్లాట్‌ఫారమ్ పరిచయం చేసింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP). దీంతో మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి సులభంగా తెలుసుకోవచ్చు
సంచార్ సాథి అధికారిక వెబ్సైట్ www.sancharsathi.gov.in ద్వారా సిమ్ కార్డులు చెక్ చేసి మీరు సులభంగా తెలియని సిమ్ కార్డులను బ్లాక్ కూడా చేయవచ్చు. మీరు పోగొట్టుకున్న సిమ్ కార్డు ఇంకా యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేసుకోవచ్చు.
మొదట www.sancharsathi.gov.in పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత 'నో యువర్ మొబైల్ కనెక్షన్' ఆప్షన్ ఎంచుకోండి. మీ పది అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయాలి. క్యాప్చా కూడా నమోదు చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాలి.అక్కడ మీ పేరుపై ఉన్న మొబైల్ సిమ్ కార్డులు కనిపిస్తాయి.
ఈ వెబ్సైట్లో మీకు సంబంధంలేని సిమ్ కార్డులు బ్లాక్ చేయవచ్చు. లేకపోతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తరచూ మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీ గుర్తింపు కార్డు, డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా కూడా ఉంటుంది.