School Holidays: విద్యార్థులకు మరో బంపర్‌ జాక్‌పాట్‌.. సంక్రాంతి తర్వాత వరుసగా 6 రోజులు సెలవు పొడగించిన ప్రభుత్వం..!

Makara Sankranti School Holidays Extended: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు ఇతర విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం అంటే రేపు 10వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే, సంక్రాంతి తర్వాత వరుసగా మరో 6 రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

సంక్రాంతి ప్రతి ఏడాది కనులపండువగా జరుపుకుంటారు. అందుకే స్కూళ్లు, ఆఫీసులకు సైతం సెలవులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఇది భారీ గుడ్‌న్యూస్‌ అయింది. అందరూ ఊర్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.  

2 /5

అయితే, తెలంగాణలో అయితే, 11వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు లభిస్తున్నాయి. ఇంటర్‌ చదువుతున్న వారికి కూడా అప్పటి నుంచే స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. ఇక క్రిస్టియన్‌ మైనారిటీ స్కూళ్లకు కూడా సెలవులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సంక్రాంతి పండుగ చాలా గ్రాండ్‌గా జరుపుకోవడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు.  

3 /5

సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ ఏడాది 14వ తేదీ సంక్రాంతి పండుగ రానుంది. అంతకు ముందు రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇక 15వ తేదీ కనుమ పండుగ. ఈ మూడు రోజులు పండుగ జరుపుకుంటారు. అందుకే ఏపీలో దాదాపు పది రోజులపాటు సెలవులు లభిస్తున్నాయి. ఇక మళ్లీ పాఠశాలలు తిరిగి 20వ తేదీ తెరుచుకోనున్నాయి.  

4 /5

అయితే, సంక్రాంతి 14వ తేదీ తర్వాత వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. శుక్రవారం ఒక్క రోజు కూడా హాలిడే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు మరో బంపర్‌ ఆఫర్‌ అయింది. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో కూడా పొంగల్‌ జరుపుకుంటారు.  

5 /5

ఇక పండుగ సందర్భంగా కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు బ్యాంకులు కూడా బంద్‌ ఉండనున్నాయి. మకర సంక్రాంతి రోజు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగ జరుపుకుంటారు. అందుకే బ్యాంకులకు కూడా సెలవులు వచ్చాయి. సంక్రాంతి పండుగ నాడు రంగురంగుల ముగ్గులు వేస్తారు. పతంగులు ఎగురవేస్తారు.