బంగారు కొనుగోలుదారులకు వరుసగా రెండోరోజు శుభవార్త. శుక్రవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రెండో రోజు తగ్గాయి. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి సైతం బంగారం దారిలోనే నడిచింది. ధరలు తగ్గడంతో నేడు బంగారు, వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ తప్పిదంతోనే భారత్లో తొలి కరోనా మరణం!
మార్చి 12న (శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల ధర రూ.520 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,180కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,320కి పడిపోయింది.
రూ.70 లక్షల లాటరీ నెగ్గినా, అంతలోనే పెను విషాదం
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.43,400 అయింది. కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,200కు క్షీణించింది.