Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండను రేవంత్‌ రెడ్డి ఎందుకు పిలవలేదు? కారణం తెలిస్తే షాకవుతారు

Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 26, 2024, 05:22 PM IST
Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండను రేవంత్‌ రెడ్డి ఎందుకు పిలవలేదు? కారణం తెలిస్తే షాకవుతారు

Film Celebrities Meeting: తెలుగు సినీ పరిశ్రమతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. పరిశ్రమలోని అగ్ర నటులతోపాటు దర్శకులు, నిర్మాతలు, సినిమా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే కొందరు ముఖ్యమైన హీరోలు, దర్శక నిర్మాతలు రాకపోవడం చర్చనీయాంశమైంది. వారిలో నందమూరి హీరోలు లేరు. వారితోపాటు తెలంగాణకు చెందిన రౌడీ హీరో.. ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కనిపించలేదు. అసలు విజయ్‌ను ప్రభుత్వం పిలవలేదని తెలుస్తోంది. ఎందుకు పిలవలేదని చర్చ జరుగుతోంది.

Also Read: TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!

తెలంగాణ ప్రాంతానికి చెందిన నటుల్లో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరో. అగ్ర నటుల సరసన నిలుస్తున్న విజయ్‌ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానం పలకలేదనే చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులతో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణకు చెందిన హీరోనే విస్మరించడం వెనుక ఏం జరిగింది? ఎందుకు పిలవలేదని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమ సమస్యలపై రేవంత్‌ రెడ్డి నిర్వహించిన సమావేశానికి సొంత ప్రాంత హీరోకు ఆహ్వానం పలకకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: TFI Meets Revanth Reddy: సినీ ప్రముఖుల ప్రతిపాదనలు.. సీఎం ఏమన్నారంటే..?

దురుద్దేశపూర్వకంగానే విజయ్‌కు ఆహ్వానం పలకలేదని తెలుస్తోంది. దాని వెనుక విజయ్‌ గత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాడు. నాటి సీఎం కేసీఆర్‌, నాటి మంత్రి కేటీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగించాడనే ప్రచారం ఉంది. దీనికితోడు వరంగల్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడి అండదండతో విజయ్‌ ఎదిగాడు. దీనికితోడు విజయ్‌ దేవరకొండ కేసీఆర్‌ సామాజిక వర్గం ఒకటే కావడంతో నాటి ప్రభుత్వంతో విజయ్‌ సన్నిహితంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. దానిని దృష్టిలో ఉంచుకుని తాజా సమావేశానికి రేవంత్‌ రెడ్డి పిలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌కు ఆహ్వానం పలకకపోవడంపై రాజకీయంగానూ చర్చ నడుస్తోంది.

అవన్నీ పక్కనపెడితే అసలు విజయ్‌ దేవరకొండ హైదరాబాద్‌లో లేడని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సమావేశానికి ఆహ్వానం పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయగా.. అతడు హైదరాబాద్‌లో లేనని.. రాలేని పరిస్థితి అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహ్వానం పలికినా విజయ్‌ రాలేకపోయాడని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణకు చెందిన హీరో ఈ సమావేశానికి రాకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలుగా చర్చ నడుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News