KCR Christmas Wishes: 'పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశ' అని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గం అత్యద్భుతమని కొనియాడారు. ఈ సందర్భంగా పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని కేసీఆర్ గుర్తుచేశారు.
Also Read: KCR Petition: మాజీ సీఎం కేసీఆర్ సంచలనం.. కాళేశ్వరం అంశంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్
క్రీస్తు పుట్టినరోజు.. క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. 'క్రీస్తు బోధనలు.. కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయి. యే నేరము చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని ప్రభువును వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు' అని కేసీఆర్ కొనియాడారు. పాపులను కూడా క్షమించే ఓర్పు.. సహనం.. దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గం' అని వివరించారు.
Also Read: School Holidays: విద్యార్థులకు జాక్‌పాట్.. వరుసగా మూడు రోజుల సెలవులు
'విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరికీ యేసు బోధనలు అనుసరణీయం. ద్వేషంతో నిండిపోతూ రోజురోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుంది' అని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. గంగా జమున సంస్కృతి ఫరిడవిల్లేలా.. మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించి చూపిందని గుర్తుచేశారు.
'పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో క్రిష్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశాం. పలు కానుకలను అందిస్తూ క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది' అని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.