Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా తగ్గాయ్..కొనేందుకు ఇదే మంచి ఛాన్స్

Hyderabad Real Estate:  హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇండ్ల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు అంతకంతకు దిగి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గుతుంది. దీంతో ఇళ్ల  ధరలు భారీగా పడిపోతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు. అయితే డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లను కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.   

Written by - Bhoomi | Last Updated : Dec 22, 2024, 08:58 AM IST
Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా తగ్గాయ్..కొనేందుకు ఇదే మంచి ఛాన్స్

Hyderabad Real Estate: దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గుతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు గరిష్టంగా దిగుతున్నాయి. ఒకప్పుడు భారీగా పెరిగిన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మళ్లీ కుదేలవుతోంది. ప్రస్తుత ఏడాది అమ్మకాలు చూస్తే అర్థమవుతుంది. ఇళ్ల  అమ్మకాలపై ఈ మధ్య కాలంలో విడుదలైన నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

తాజాగా ప్రాప్ ఈక్విటీ సంస్థ విడుదల చేసిన గణాంకాలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 21శాతం పడిపోయాయని తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, బెంగళూరు,  కలకత్తా, పూణె, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో 1.08 లక్షల యూనిట్ల ఇండ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,37,225 యూనిట్లతో పోల్చిచూస్తే భారీగా తగ్గాయి. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ లో మాత్రమే విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది.ఇళ్ల  అమ్మకాలు పడిపోయిన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే?  

అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ లో 12,682 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు క్రితం ఏడాది నమోదు అయిన 24,044తో పోలిస్తే 47శాతం తగ్గాయని పేర్కొంది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 13శాతం తగ్గాయి. చెన్నై లో 9శాతం తగ్గాయి. అధిక బేస్ రేట్ కారణంగా ఇళ్ల విక్రయాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ సీఈవో ఫౌండర్ సమీర్ జాసుజా తెలిపారు. పండగ సీజన్ కావడంతో మూడో త్రైమాసికంతో పోల్చితే ఈ తర్వాతి క్వార్టర్ లో అమ్మకాలు పెరిగాయని తెలిపారు. 

అయితే నిర్మానంలో ఉన్న ఇళ్లతో పోలిస్తే సిద్ధంగా ఉన్న ఇళ్ల  ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ జోరు తక్కువగా ఉన్న నేపథ్యంలో బిల్డర్లు ధరలను తగ్గించి విక్రయిస్తున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. అలాంటి వారికి బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. పేమెంట్ చేసేందుకు వెసులుబాటు కూడా కల్పిస్తున్నారని సమాచారం. ఆరంభంలో ఉన్న ప్రాజెక్టుల గురించి పెద్దగా తెలుసుకోలేరు. కాబట్టి ఇప్పటికే పూర్తయిన వాటిని స్వయంగా పరిశీలించి తమకు నచ్చితే కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. క్వాలిటీని కూడా చెక్ చేసుకోవచ్చు.మీరు ఇళ్లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. 

Also Read:School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x