Mahesh Babu Wig Pics Viral: సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు మహేష్ బాబు హెయిర్ గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మహేష్ బాబుకు జుట్టుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇంతకీ మహేష్ బాబుది రియల్ జుట్టా కాదా? ఇప్పుడు తెలుసుకోండి..
Super Star Mahesh Babu Latest Wig Pics Viral: ఏ సినిమా ప్రేక్షకుడికైనా తప్పకుండా ఒక అభిమాన హీరో ఉండి ఉంటాడు. అంతేకాకుండా చాలామంది ప్రేక్షకులు హీరోలనే కాకుండా అభిమానులుగా విలన్స్, కమెడియన్స్‌ని కూడా చేర్చుకుంటున్నారు. ఈ ప్రేక్షకులంతా వారి అభిమాన హీరోలకు, కమెడియన్, విలన్స్‌కు సంబంధించిన అన్ని రకాల పర్సనల్ విషయాలను ఎంతో ఆసక్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వారికి సంబంధించిన రోజు అలవాట్లు, వారు వాడుతున్న కార్లు, దుస్తులు ఇలా రకరకాల విషయాలను ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
కొంతమంది ప్రేక్షకులైతే వారి అభిమాన హీరోలకు సంబంధించిన స్మార్ట్ వాచీలు, మొబైల్స్ ఖరీదైనవా కావా? అని కూడా రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే వారి అభిమాన హీరోలకు సంబంధించిన హెయిర్ స్టైల్ విషయాలను కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారు ఆ సినిమాలో దువ్వుకున్న హెయిర్ స్టైల్ నిజమేనా అది రియల్ జుట్టేనా అని తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
కొన్ని రోజుల నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన హెయిర్ లుక్కుతో కనిపించడంతో చాలామంది ఇది రియల్ హెయిరా? కాదా అనే అనుమానంతో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయన హెయిర్ కు సంబంధించిన అంశంపై మహేష్ బాబు తన తండ్రి కృష్ణ మేకప్ మ్యాన్ అయిన మాధవరావు వివరించే ప్రయత్నం చేశాడు.
సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన మేకప్ మ్యాన్ మాధవరావు ఇటీవలే కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఒక లేడీ యాంకర్ మహేష్ బాబు హెయిర్ పై కొన్ని క్యూస్షన్స్ అడిగింది. దీనికి ఆ మేకప్ మ్యాన్ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు.
ఇంటర్వ్యూలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణకు మేకప్ మాన్‌గా పని చేసిన మాధవరావు మహేష్ బాబు జుట్టుపై అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. గతంలో కృష్ణ యంగ్ హీరోగా యాక్ట్ చేసేటప్పుడు నిజమైన జుట్టుతోనే పాత్రలన్నీ చేసే వారా? అని ప్రశ్న అడగగా.. ఆ మేకప్ మాన్.. గతంలో కృష్ణ జుట్టు ఒత్తుగా ఉన్నప్పుడు ఒరిజినల్ హెయిర్ తోనే యాక్టింగ్ చేసేవాడు.. అయితే కాలక్రమమైన పల్చబడడంతో కొన్ని సినిమాల్లో విగ్గు పెట్టుకొని నటించే వారిని చెప్పారు.
అయితే యాంకర్ ఆ మేకప్ మ్యాన్ ని మహేష్ బాబు జుట్టుపై కూడా ఓ ప్రశ్న అడుగుతుంది.. మహేష్ బాబు కూడా ఒరిజినల్ హెయిర్ తోనే యాక్టింగ్ చేస్తారా? అనే ప్రశ్నకు ఆ మాధవరావు ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు.. మహేష్ బాబు ఎప్పటినుంచో విగ్గు వినియోగిస్తూ వస్తున్నాడని.. గతంలో నుంచి ఆయనకు పలుచబడిన జుట్టు ఉండడంతో చాలా సినిమాల్లో విగ్గు వినియోగించి నటించారన్నారు.
అంతేకాకుండా మహేష్ బాబు గతంలో కొన్ని సినిమాలలో తన ఒరిజినల్ హెయిర్ తోనే నటించేవారని.. పోను పోను తన జుట్టు పలచబడడంతో విగ్గు పెట్టుకొని కొన్ని సినిమాల్లో నటించారని మేకప్ మ్యాన్ మాధవరావు చెప్పారు. విగ్గుతో నటించిన సినిమాలు చాలా తక్కువ అని ఆయన అన్నారు..
అంతేకాకుండా ప్రతినెల విగ్గును వినియోగించడం కష్టమవుతుందని ఇటీవలే మహేష్ బాబు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ తో వచ్చిన క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీని వినియోగించి మహేష్ బాబు కొత్త హెయిర్ ని పొందాలని తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు ఏ కాకుండా బాలీవుడ్ లో ఎందరో హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే..
(గమనిక: మేము రాసిన ఈ స్టోరీ కేవలం పాత ఇంటర్వ్యూ నుంచి తీసుకోబడింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. దీనిని జీ న్యూస్ అస్సలు ధ్రువీకరించలేదు)