Shocking Video: భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయ్..కారు 8 సార్లు పల్టీలు కొట్టినా బతికి బయటపడ్డారు

Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కార్లు, బైకులు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాయి. అయినా కూడా నిత్యం ఏదొక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన భయాందోళనకు గురి చేసింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు 8 పల్టీలు కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Dec 21, 2024, 03:34 PM IST
Shocking Video: భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయ్..కారు 8 సార్లు పల్టీలు కొట్టినా బతికి బయటపడ్డారు

Accident Viral Video: రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనను చూస్తే వారికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయని అనిపిస్తుంది. చావు అంచుల వరకు వెళ్లిన ఓ ఐదుగురు అద్రుష్టం బాగుండి క్షేమంగా బయటపడ్డారు. వారు ప్రయాణిస్తున్న  కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టింది. కారు 8 పల్టీలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఉన్నవారు ఒక్కరూ ప్రాణాలతో బతికే అవకాశమే ఉండదు. కానీ ఈ కారులు ఉన్న ఐదుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. చిన్న గాయం కూడా అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అసలు కథ ఏంటంటే రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతాంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓ మూలమలుపు దగ్గర వీరి కారు అదుపుతప్పింది. సెకన్ల వ్యవధిలోనే కనీసం 8 సార్లుపల్టీలుకొట్టింది. ఆ కారు వెళ్లి  ఓ కారు షోరూమ్ గేటుపై పడింది. 

Also Read: ​Viral video: రష్యాపై 9/11 తరహా దాడి.. వీడియో ఫ్రూఫ్‌ ఇదిగో.. పుతిన్‌కు చెమటలు 

ఈ భయంకరమైన ఘటనలో ఎవరీ ఎలాంటి గాయం కాలేదు. కారు పల్టీలు కొడుతున్న సమయంలో అందులో ఉన్నవారు బయటకు దూకేశారు. ఇక్కడితే ఆగలేదు..పక్కనే ఉన్న కారు షోరూమ్ లోకి వెళ్లి మాకు కొంచెం టీ ఇస్తారా అంటూ అడిగడంతో అక్కడున్న షోరూమ్ సిబ్బంది షాక్ అయ్యారు. 

 

Also Read: Viral Video: ఈ అమ్మాయి అచ్చం జహీర్‌ లాగే ఎలా బౌలింగ్‌ వేస్తుందో చూడండి.. ఏకంగా క్రికెట్‌ గాడ్‌ కూడా ఫ్లాట్!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News