AP Liquor Prices: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మద్యం పాలసీ మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం మళ్లీ వచ్చింది. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అందిస్తామనేది కూటమి ప్రభుత్వం హామీ. అందులో భాగంగా తాజాగా కొన్ని కంపెనీలు మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఏపీలో మధ్యం ధరలు మరింతగా తగ్గాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక గత ప్రభుత్వ హయాంలో కంటే ధరల్ని తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరింతగా తగ్గించింది. తాజాగా 11 కంపెనీలు మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే అధిక ధరలు, బెల్టు షాపుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలకు ఉపక్రమించింది. అధిక ధరలు విక్రయించినా లేక బెల్టు షాపుల్ని ప్రోత్సహించినా ముందు జరిమానా ఉంటుంది. ఆ తరువాత లైసెన్స్ రద్దు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 99 రూపాయలకే క్వార్టర్ మందు ఇస్తామని ఏకంగా ఎన్నికల్లో హామీనే ఇచ్చింది. అయితే ధరలపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మద్యం కంపెనీలతో చర్చలు జరిపింది. ఇటీవల మూడు కంపెనీలు మద్యం ధరల్ని తగ్గించగా తాజాగా మరో 11 కంపెనీలు ఎమ్మార్పీపై 30 రూపాయలు తగ్గించాయి.
ఏపీలో మద్యం ధరలు
మేన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర 220 రూపాయల్నించి 190 రూపాయలకు తగ్గింది. ఙాఫ్ అయితే 440 నుంచి 380 అయింది. ఫుల్ బాటిల్ 870 నుంచి 760 అయింది. రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210 రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర 920 నుంచి 840 అయింది. యాంక్విటీ బ్లూ విస్కీ ఫుల్ ధర 1600 నుంచి 1400 అయింది. ిక నుంచి ప్రతి మద్యం దుకాణం వద్ద మద్యం బ్రాండ్లు, ధరల పట్టిక కచ్చితంగా డిస్ ప్లే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also read: Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.