Upendra UI Twitter Review: కొంచెం కొత్తగా.. మూర్ఖులకు మాత్రమే సినిమా.. యూఐ ట్విట్టర్ రివ్యూ

UI Review and Rating: ఉపేంద్ర తన కొత్త చిత్రం "యూఐ" గురించి ప్రమోషన్లు చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా ఆడియెన్స్ ఇంటెలిజెన్స్‌ను.. పరీక్షించే విధంగా ఉండబోతుందని తెలిపాడు. ముఖ్యంగా, క్లైమాక్స్.. షాట్‌ను డీ కోడ్ చేయాలని, అయితే అది ఆపాదించడం కష్టం అన్నాడు. ఇక ఈరోజు ఈ సినిమా విడుదల అవ్వగా.. ఉపేంద్ర చేసిన హెచ్చరిక అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 20, 2024, 01:18 PM IST
Upendra UI Twitter Review: కొంచెం కొత్తగా.. మూర్ఖులకు మాత్రమే సినిమా.. యూఐ ట్విట్టర్ రివ్యూ

 

UI Twitter Review: కొత్తదనం చూపించడంలో ఉపేంద్ర ఎప్పుడు ముందుంటారు. అయితే ఆయన కొట్టదనం కొంతమంది అసలు జీవించుకోలేరు. ఇప్పుడు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన యుఐ సినిమా కూడా ఇలానే ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ఈరోజు విడుదల అవ్వగా.. ఈ సినిమా మొదట్లో వచ్చిన హెచ్చరికను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  మీరు మీరే తెలివైన వాళ్లు అనుకుంటే, ఈ సినిమాను చూడకండి, థియేటర్ నుంచి వెళ్లిపోతే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడట. ఏకంగా మీరు మూర్ఖులు.. అయితే మాత్రమే ఈ సినిమా చివరి వరకు చూడండి అనే మెసేజ్ వేశారు ఈ హీరో.

 

ఈ నేపథ్యంలో ఉపేంద్ర ధైర్యం ఏమిటి? అసలు సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంది?  ఈ సినిమా గురించి జనాలు ఏం చెప్పుకుంటున్నారు అన్నది చూద్దాం.

కథ విషయానికి వస్తే..యూ అండ్ ఐ.. పగలు, రాత్రి.. కల్కి భగవాన్ వర్సెస్ సత్య (ఉపేంద్ర) అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుందని, ఈ చిత్రం మొత్తం ఉపేంద్ర వన్ మెన్ షో అని అంటున్నారు.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్ అని, అదరగొట్టేశాడని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మిగతా డైరెక్టర్ల మాదిరి కాదని.. టోటల్ డిఫరెంట్ అని ఉప్పి దుమ్ములేపేశాడని అంటున్నారు.

 

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చూసిన ఎంతోమంది.. ఈ సినిమా బోర్ గా ఉందని.. అయినా కానీ డిఫరెంట్ గా ఉంది అని అంటున్నారు. కొంచెం కొత్తగా, కొంచెం చెత్తగా ఉంది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇక ఇంట్రవెల్స్ ముందు వచ్చే ఉపేంద్ర డైలాగ్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. 

 

మరి కొంతమంది ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే.. మనకు చాలా తెలివి ఉండాలి అని అంటున్నారు. అంతేకాదు చాలామంది అసలు ఈ సినిమాకి రేటింగ్ అనేది ఇవ్వలేమని ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం గమనర్హం. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర.. తెలివైన వాళ్లు ఎక్కువగా ఉన్నారని రుజువు చేస్తుందా.. మూర్ఖులు ఎక్కువగా ఉన్నారని రుజువు చేస్తుందా చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

 

Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పెండింగ్‌ డీఏలపై అసెంబ్లీలో చర్చ

Also Read: New Year 2025: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసుల షాక్‌.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News