మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!

మార్చి నెలలో బ్యాంకు పనులున్నవారికి అలర్ట్. బ్యాంకు ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వ సెలవుల కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 28, 2020, 11:38 AM IST
మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!

హైదరాబాద్: వచ్చే నెల అంటే మార్చి నెలలో మీరు ఏమైనా బ్యాంకు లావాదేవీలు చేయాలా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. మార్చి నెలలో వరుసగా 6 రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రభుత్వ సెలవులతో పాటు బ్యాంకు యూనియన్ల సమ్మెలు ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ విషయాలు తెలుసుకుని బ్యాంకుల ఖాతాదారులు తమ లావాదేవీలను ఈ తేదీలకు ముందుగానో లేక తర్వాతనో అయ్యేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. 

Also Read: వామ్మో .. మార్చిలో బ్యాంకులకు అన్ని సెలవు దినాలా?

జనవరి 31, ఫిబ్రవరి 1న సమ్మె చేసిన బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు మూడు రోజులపాటు బ్యాంకులు పనిచేయకపోతేనే ఖాతాదారులపై, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి సమ్మె అంటే.. దాదాపు 6 రోజులు బ్యాంకు సేవల్ బంద్ కానున్నాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రకారం మార్చి 11 నుంచి మూడు రోజులు బ్యాంక్ సమ్మె ఉంటుంది.  మార్చి 14, 15 ఎలాగూ రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆరోజు బ్యాంకులు పనిచేయవు. మార్చి 10న హోలీ కావడంతో సెలవు ఉంటుంది.

ఇటీవల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో బ్యాంక్ యూనియన్లు జరిపిన చర్చిలు విఫలం కావడంతో మరోసారి సమ్మె చేయనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు ఐదేళ్లకు ఓసారి వేతన సవరణ ఉండగా, 2017లో తాజా వేతన సవరణ జరగాల్సి ఉన్నా వాయిదా వేశారు. వీటితో పాటు ఉద్యోగులు పే స్లిప్ కాంపొనెంట్స్‌‌లో 20 శాతం ఇంక్రిమెంట్ డిమాండ్ చేయగా.. 12.5 శాతం పెంపు ఇస్తామని ఐబీఏ చెప్పడం సమ్మెకు ఓ కారణం.

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్ 

అన్ని శని, ఆదివారాల్లో సెలవుదినాలుగా ప్రకటించాలని, స్పెషల్ అలవెన్స్ అమౌంట్‌ను బేసిక్ శాలరీ పేలో కలపడం, కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు లాంటివి బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఇస్తున్నారు.

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా 

See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News