EPFO: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. అధిక పింఛన్ వివరాల అప్ లోడ్ గడువు పెంచిన ప్రభుత్వం

Higher Pension: ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త చెప్పంది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారుల అధిక పింఛను దరఖాస్తు గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. దీంతో 3లక్షల మంది ఊరట లభించింది. 
 

1 /8

Higher Pension: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా విధించిన గడువు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పొడిగింపు నిర్ణయం  తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.   

2 /8

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 3లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది. అధిక పింఛను వ్యవహారంలో గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉద్యోగులకు అధిక పింఛన్ కోసం ఛాన్స్ ఇచ్చారు. దానికోసం ఆన్ లైన్ లో ఉద్యోగులు, పింఛన్ దారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దీనికి మొదట మార్చి వరకు గడువు  ఉండగా పలు దఫాలుగా పొడిగింపు అవకాశాన్ని ఇచ్చారు. తాజాగా మరోసారి ఈ గడువును పెంచారు. 

3 /8

అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్స్, జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి EPFO ​​ద్వారా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా  అర్హత కలిగిన పెన్షనర్లు, సభ్యుల కోసం ఈ సౌకర్యం కల్పించింది. ఉద్యోగుల ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తులను దాఖలు చేయడానికి అర్హులైన పింఛనుదారులు, సభ్యులకు పూర్తి నాలుగు నెలల సమయాన్ని అందించడానికి కాల పరిమితిని పలు దఫాలుగా పెంచుకుంటూ వస్తోంది.   

4 /8

అర్హులైన పింఛనుదారులు, సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తొలగించేందుకు అవకాశం ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి దరఖాస్తుదారు పెన్షనర్లు, సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు అందిన ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుండి అభ్యర్థనలు వచ్చాయి.   

5 /8

ఇన్ని దఫాలుగా పొడిగించినప్పటికీ ఇప్పటికీ ఇంకా  3.1 లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికీ యజమానుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించింది. దరఖాస్తుదారు పెన్షనర్లు/సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి మరింత కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు ఈపీఎఫ్ఓకు అందాయి.   

6 /8

యజమానులు ఈ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఆప్షన్ , జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం ప్రాసెస్ చేసి అప్‌లోడ్ చేస్తారని నిర్ధారించుకోవడానికి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ  వరకు యజమానులకు తుది అవకాశం ఇచ్చింది. .

7 /8

EPFO ద్వారా స్వీకరించిన,  పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి EPFO ​​అదనపు సమాచారం కోరిన  4.66 లక్షల కేసులలో,జనవరి 15వ తేదీ 2025  నాటికి ప్రత్యుత్తరాలు సమర్పించిన వాటిని అప్ డేట్ చేయాల్సిందిగా యజమానులను అభ్యర్థించారు.  

8 /8

దరఖాస్తుల అప్‌లోడ్‌లో ఇప్పటివరకు పింఛనుదారులు, చందాదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిష్కరించుకునేందుకు , ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి సంఘాలు ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా  జనవరి 31  వరకు దరఖాస్తుకు సమయమివ్వాలని భావించినట్లు ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.