Hydra: ఆ భవనాలన్ని నేలమట్టం.. మళ్లీ రంగంలోకి హైడ్రా..

Hydra: గత కొన్ని నెలల ముందు వరకు హైదరాబాద్ లో నాలాలు, చెరువులపై కట్టిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసి అక్రమ కట్టడాలు కట్టిన వారు ఎంతటి వారైనా తగ్గేది లేదంటూ మొదట ప్రశంసలు దక్కించుకుంది. అదే సమయంలో  మూసీ నదిలో అక్రమ కట్టడాలపై హైడ్రా రంగంలోకి దిగడంతో ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. దీంతో కొన్నాళ్లు హైడ్రా కమిషనర్ సైలెంట్ అయింది. తాజాగా హైడ్రా మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 10:11 AM IST
Hydra: ఆ భవనాలన్ని నేలమట్టం.. మళ్లీ రంగంలోకి హైడ్రా..

Hydra: రేవంత్ రెడ్డి సర్కార్.. తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపై హైడ్రాను ఉసిగొల్పాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన నేతలు చెరువులు, నాలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన వాటిపై హైడ్రా బుల్‌డోజర్లు వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపైనే కక్ష్య పూరితంగానే రేవంత్ సర్కార్ హైడ్రాతో కూల్చివేతలకు పాల్పడుతుందనే విషయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మూసీ ప్రక్షాళన ముఖ్యమే అయినా.. ఈ విషయంలో అక్కడ ప్రజలను ఒప్పించి ఖాళీ చేయించకుండా వారిపై దౌర్జన్యానికి దిగడంతో హైడ్రాపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొన్నాళ్లు సైలెంట్ ఉన్న హైడ్రా మళ్లీ జూలు విదిలించడానికి రెడీ అవుతోంది.

తాజాా హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు వెళ్లము అన్నారు.  అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదన్నారు. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వెల్లడించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుంది.

అంతేకాదు తాము పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు అని కమిషనర్ రంగనాథ్‌ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దుని రంగనాథ్ పేర్కొన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అలా లేవు.

హైడ్రా కమిషనర్‌  రంగనాథ్‌ వ్యాఖ్యలతో  సామాన్యులకు ఊరట లభిస్తుందని అనుకున్నా… కమర్షియల్ కట్టడాలపై మాత్రం కత్తి వేళ్లాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాగార్జున్ కు చెందిన ఎన్‌ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను హైడ్రా కూల్చేసింది. ఇదే తరహాలో ముందు ముందు కూల్చివేతలు కొనసాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం మవుతున్నాయి.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News