One Nation one Election Bill: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన బీజేపీ నేతృత్వంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ చరిత్రను మార్చే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర లా మినిష్టర్ అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్‌సభ ముందుకు జమిలి బిల్లును దిగువ సభలో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ భాగస్వామ్య పక్షాలైన తెలుగు దేశం, జనసేన పార్టీ బేషరుతుగా మద్దతు తెలిపింది. అటు ఎన్డీయే కూటమిలోని పార్టీలైన జెడీయూ, జేడీఎస్, శివసేన పార్టీలు జమిలీ ఎన్నికల బిల్లుకు మద్దుతు తెలిపింది.
జమిలీ ఎన్నికల బిల్లుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పార్టీలైన శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం అంటూ హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. జమిలి ఎన్నికలు అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తాయని చెప్పుకొచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ తరుపున మనీష్ తివారీ, గౌరవ్ గోగోయ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అటు శివసేన ఏక్ నాథ్ షిండే తరుపున శ్రీకాంత్ షిండే ఈ బిల్లుకు బేషరుతుగా మద్దతు తెలిపారు.
అటు టీడీపీ తరుపున కేంద్ర మంత్రి పెమ్మసారి చంద్రశేఖర్.. బేషరతుగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించినట్టు తెలిపాయి. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని సూచించారు.
ఇప్పటికే బీజేపీ తన రెండు టర్మ్స్ లో ఆర్టికల్ 370, 35 ఏ, సీఏఏ సహా పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.