O Thandri Teerpu: 'ఓ తండ్రి తీర్పు’ ఎలా ఉండబోతుంది..? ఈ నెల 27న రిలీజ్

O Thandri Teerpu Movie: కుటుంబ విలువలు నేటి సమాజానికి చాటి చెప్పేలా ఓ తండ్రి తీర్పు అనే మూవీ తెరకెక్కింది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించగా.. వివ రెడ్డి హీరోగా నటించారు. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 16, 2024, 04:01 PM IST
O Thandri Teerpu: 'ఓ తండ్రి తీర్పు’ ఎలా ఉండబోతుంది..? ఈ నెల 27న రిలీజ్

O Thandri Teerpu Movie: వివ రెడ్డి హీరోగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓ తండ్రి తీర్పు. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మించారు. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచనతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 27న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో ఆస్తుల కోసం తల్లిదండ్రులను ఎంత క్షోభకు గురి చేస్తున్నారో మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. ఆస్తులపై ఉన్న ప్రేమ.. కన్న తల్లిదండ్రులపై లేకపోతే ఎలా ఉంటుందో అనే పాయింట్‌తో రూపొందించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. హీరో వివ రెడ్డి చేస్తున్న పాత్ర చాలా బాగుంటుందని తెలిపారు. చాలామంది కొడుకులకు ఈ పాత్ర కనువిప్పు కలిగించేలా ఉంటుందన్నారు.  ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉందని ప్రొడ్యూసర్ శ్రీరామ్ దత్తి తెలిపారు.  ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని కోరారు. రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్, కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, జబర్దస్త్ నాగరాజు, రారాజు, సురభి శ్రావణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

టెక్నీకల్ టీమ్:

==> ప్రొడ్యూసర్: లయన్ శ్రీరాం దత్తి
==> డైరెక్షన్: ప్రతాప్ భీమవరపు
==> రైటింగ్, దర్శకత్వ పర్యవేక్షణ: రాజేంద్రరాజు కాంచనపల్లి
==> సినిమాటోగ్రఫీ: సురేష్ చెటిపల్లి
==> మ్యూజిక్: మధు బాపు శాస్త్రి
==> సాంగ్స్: రాజేంద్ర రాజు కాంచనపల్లి, హరితస, కళా రత్న  బిక్కి కృష్ణ, డాక్టర్ దాసరి వెంకటరమణ
==> నేపథ్య సంగీతం: చరణ్ అర్జున్
==> కో డైరెక్టర్స్: శేషు కుమార్, కళింగ రంగనాథ్ కొత్తకోట 
==> పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి
==> ఆర్ట్ : దుద్దుపూడి ఫణి రాజు  
==> ప్రొడక్షన్ చీఫ్ : రాంబాబు రామకృష్ణ రాజు.
==> కొరియోగ్రాఫర్: గిరి 
==> ప్రొడక్షన్ : శివ 
==> మేకప్: కరుణాకర్, లక్ష్మి.

Also Read: Gold Rate Today: లక్కీ ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. సంక్రాంతి పండగ కంటే ముందే  కొనేయ్యండి   

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x