Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..

Latest Paper Plate Business Idea: వ్యాపారం అనేది చాలా మందికి ఆకర్షణీయమైన అంశం. చాలా మంది ఏటు వంటి బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తారు. ఏ వ్యాపారం సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ రంగంలో ఎక్కువ అనుభవం ఉంది? మీకు ఏ పనులు చేయడం ఇష్టం? మీ నైపుణ్యాలను ఉపయోగించుకునే వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఈరోజు మనం తెలుసుకొనే బిజినెస్‌ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండేది. ఈ బిజినెస్‌ను ఇంట్లోనే ఉండే మహిళలు కూడా స్టార్ట్‌ చేయవచ్చు.

1 /10

నేటి తరంలో సొంత వ్యాపారం ప్రారంభించడం ఒక ట్రెండ్‌గా మారింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి జాబ్‌లో వచ్చే జీతాలు సరిపోకపోవడం, ప్రతిభకు తగిన గుర్తింపు లేకపోవడం,  సమయం లేకపోవడం వంటి కారణాలు కూడా ముఖ్యమైనవే.  

2 /10

ముఖ్యంగా బిజినెస్‌ స్టార్ట్ చేయడానికి కారణం జాబ్‌లో మనం ఎంత సంపాదిస్తామో అంతే సంపాదించాలి. కానీ, వ్యాపారంలో మన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో మన ఆలోచనలను, సృజనాత్మకతను ఉపయోగించుకొని కొత్త విషయాలు చేయవచ్చు.

3 /10

బిజినెస్ అనేది ఎవరికైనా, ఎప్పుడైనా ప్రారంభించగల ఒక అద్భుతమైన అవకాశం. ఇంట్లో ఉండే మహిళలకు బిజినెస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి ఖర్చులను భరించడానికి, కుటుంబానికి ఆర్థికంగా సహాయపడడానికి బిజినెస్ మంచి మార్గం.

4 /10

మహిళలకు బిజినెస్ ప్రారంభించడం ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. స్వంత బిజినెస్‌ను నడపడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమస్యలను పరిష్కరించే శక్తి పెరుగుతుంది.

5 /10

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ పేపర్ ప్లేట్  వ్యాపారం. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నంతే కాకుండా, పర్యావరణానికి కూడా మంచిది.  ప్లాస్టిక్ ప్లేట్ల కంటే పేపర్ ప్లేట్లు త్వరగా కుళ్లిపోతాయి, ఇవి పర్యావరణానికి హాని కలిగించవు.

6 /10

 పార్టీలు, ఫంక్షన్లు, వివాహాలు, ఆహారం ప్యాకేజింగ్ వంటి అనేక సందర్భాలలో పేపర్ ప్లేట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి అవసరం.  తక్కువ ఖర్చుతో తయారైన పేపర్ ప్లేట్లను అమ్మడంతో మంచి లాభం పొందవచ్చు.  

7 /10

ఈ బిజినెస్‌ను ఇంట్లోనే ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు  పేపర్, రంగులు, మెషిన్లు (చిన్న స్థాయిలో మొదలుపెట్టేవారు చేతితో తయారు చేయవచ్చు). లేదా మీరు చిన్న వర్క్‌షాప్ ఉన్న ఈ బిజినెస్‌ చేయవచ్చు. వ్యాపారం నమోదు చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది.  మీ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెటింగ్ చేయడం చాలా ముఖ్యం.

8 /10

 ఈ బినెస్‌ను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీరు పెద్దగా స్టార్ట్ చేయాలంటే సుమారు రూ. 75,000తో కూడా స్టార్ట్ చేయవచ్చు. మీ వద్ద డబ్బులేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ కూడా తీసుకోవచ్చు. 

9 /10

ఈ బిజినెస్‌తో మీరు నెలకు రూ. 30 వేలు సంపాదించవచ్చు. ముందుగా మీరు మీ ప్రాంతంలోని పేపర్ ప్లేట్ల డిమాండ్, పోటీదారులు, వారి ఉత్పత్తుల నాణ్యత, ధరలు గురించి వివరంగా తెలుసుకోవాలి. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సర్వీసులు, పార్టీ ప్లానర్లు వంటి వారిని గుర్తించి వారితో ఒప్పందాలు చేసుకోవాలి.

10 /10

సోషల్ మీడియా, వెబ్‌సైట్ ద్వారా మీ ఉత్పత్తులను ప్రచారం చేయాలి. ఈ వ్యాపారంలో కొంచెం పోటీ ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పేపర్ ప్లేట్ వ్యాపారం ఒక లాభదాయకమైన వ్యాపారం అయినప్పటికీ, దీనికి కొంత కష్టపడటం అవసరం.