Google 2024 Top Trending Searches for TV shows: 2024లో మన దేశంలో టాప్ ట్రెండింగ్ లో టీవీ షోస్ కూడా నిలిచాయి. ఇందులో హీరా మండి టీవీ షో టాప్ ప్లేస్ లో నిలిచింది.
హీరామండి.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా, అతిథి రావు హైదరీ, రేఖ, మనీషా కొయిరాల వంటి ప్రముఖ నటీమణులు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎక్కువ మంది భారతీయులు వెతికిన టీవీ షోగా నిలిచినట్టు గూగుల్ ఇండియా పేర్కొంది.
మీర్జాపూర్.. అమెజాన్ ప్రైమ్ లో ఫేమస్ అయిన పంకజ్ త్రిపాఠి, దివ్యేందు ముఖ్యపాత్రల్లో నటించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ గూగుల్ టాప్ 2లో నిలిచిన టీవీ షోగా నిలిచింది.
Last Of US.. ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘లాస్ట్ ఆఫ్ అజ్’ ఈ యేడాది ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన టీవీ షోల్లో గూగుల్ టాప్ 3లో నిలిచింది.
బిగ్ బాస్ 17.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూన్న బిగ్ బాస్ 17 టీవీ షోల్లో టాప్ 4లో నిలిచింది. ఈ యేడాది 18వ బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 17కు ను ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ చేసినట్టు తెలిపింది.
పంచాయత్.. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న పంచాయత్ వెబ్ సిరీస్ ఈ యేడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాల టాప్ 5లో నిలిచింది.
టాప్ 6 నుంచి 10 వరకు.. అటు గూగుల్ సెర్చ్ లో టాప్ టీవీ షోల్లో టాప్ 6లో 8క్వీన్ ఆఫ్ టియర్స్’.. టాప్ 7లో ‘మ్యారీ మై హస్బండ్’.. టాప్ 8లో ‘కోటా ఫ్యాక్టరీ’... టాప్ 9లో ‘బిగ్ బాస్ 18’.. టాప్ 10లో ‘3 బాడీ ప్రాబ్లెమ్ ’నిలిచాయి.