Sreemukhi Latest Photos: శ్రీముఖి ఈ క్రేజీ తెలుగు యాంకర్ నిజామాబాద్‌లో పుట్టి పెరిగింది. ఎప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను షేర్ చేసి ట్రెండింగ్ నిలిచే శ్రీముఖి ప్రస్తుతం ఆమె పచ్చ రంగులో లెహంగా ధరించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ మీకోసం...
శ్రీముఖి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి 'జూలై 'సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత' ప్రేమ ఇష్క్ కాదల్' అనే మూవీ లో కూడా ధరించిన సంగతి తెలిసిందే.
నిజామాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె డెంటిస్ట్ కూడా చదివింది. ఆ తర్వాత 'అదుర్స్' అనే టీవీ షోలో పరిచయమై ప్రేక్షకుల మననలు పొందింది.
అంతేకాదు 'సూపర్ సింగర్9' కి కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇక ఈమె 'నేను శైలజ' మూవీ లో రామ్ కు చెల్లెలిగా కూడా నటించింది.
2015లో శ్రీముఖి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ (SIIMA) మూవీ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
ఎక్కువగా మంచి పేరు తెచ్చి పెట్టిన షో 'పటాస్' ఆ తర్వాత మరిన్ని షోలను కూడా చేసింది శ్రీముఖి.
ఈ క్రేజీ యాంకర్ బిగ్ బాస్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది సీజన్ 3 లో కూడా ఈమె కంటెస్టెంట్ గా వ్యవహరించింది.
అయితే ఈ సీజన్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.
బిగ్ బాస్ 4 గెస్ట్ గా కూడా వ్యవహరించిన శ్రీముఖి, తాజాగా బిగ్ బాస్ 8 సీజన్లో కూడా గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ప్రతి పండుగకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
తాజాగా పచ్చ రంగులో ఉండే లెహంగా ధరించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్ పై తగిన చోకర్, కమ్మలు ధరించింది. ఇక గాజులు కూడా భలే సెట్ చేసి కవ్విస్తోంది పుత్తడిబొమ్మ.