Snowfall Images: మంచు దుప్పటి కప్పుకున్న ఉత్తరాది, మైనస్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరాదిన చలి గాలులు తీవ్రమౌతున్నాయి. కశ్మీర్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాలు తెల్లగా మంచుతో నిండి పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. రానున్న కాలంలో చలి మరింత పెరుగుతుందని, మంచు పెద్దఎత్తున కురవనుందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాదిన మంచు దృశ్యాలు చూద్దాం

Snowfall Images: శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరాదిన చలి గాలులు తీవ్రమౌతున్నాయి. కశ్మీర్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాలు తెల్లగా మంచుతో నిండి పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. రానున్న కాలంలో చలి మరింత పెరుగుతుందని, మంచు పెద్దఎత్తున కురవనుందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాదిన మంచు దృశ్యాలు చూద్దాం

1 /10

కశ్మీర్‌లో మంచు దృశ్యాలు కశ్మీర్‌లోని గుల్మర్గ్, పహల్ గామ్, సోన్‌మర్గ్, మాఛిల్‌లో భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత 0-0.5 డిగ్రీలకు చేరుకుంది. చాలా ప్రాంతాల్లో  మంచు దుప్పటి ఆవహించింది

2 /10

ఉత్తరాఖండ్ మంచు దుప్పటి ఉత్తరాఖండ్‌లోని మసూరీ, నైనితాల్ ప్రాంతాల్లో మంచు ప్రారంభమైపోయింది. చలి తీవ్రత జనజీవనంపై ప్రభావం చూపిస్తోంది. 

3 /10

లడ్డాక్ దృశ్యాలు లడ్డాక్ , లేహ్ , కార్గిల్ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల నుంచి 5.6 డిగ్రీలకు పడిపోతోంది. జోజిలాలో  కనిష్ట ఉష్ణోగ్రత జీరో నుంచి మైనస్ 18 డిగ్రీలకు పడిపోయింది

4 /10

గుల్మార్గ్ వాతావరణం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో మంచు గణనీయంగా కురుస్తోంది. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 0 నుంచి 3.4 డిగ్రీల దిగువకు పడిపోయింది.

5 /10

శ్రీనగర్ వాతావరణం ఇక శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత జీరో కంటే దిగువకు పడిపోయింది. చలి కారణంగా మంచి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది.

6 /10

ఉత్తరాఖండ్ మంచు దుప్పటి ఉత్తరాఖండ్‌లోని మసూరీ, నైనితాల్ ప్రాంతాల్లో మంచు ప్రారంభమైపోయింది. చలి తీవ్రత జనజీవనంపై ప్రభావం చూపిస్తోంది. 

7 /10

చలిగాలుల తీవ్రత పెరుగుతుండటంతో వేడి దుస్తులు ధరించాలని, ఇళ్లలోనే ఉండాలని సూచిస్తోంది ఐఎండీ.  

8 /10

మంచు, చలిగాలులు కారణంగా రవాణాకు ఇబ్బందిగా మారింది. ప్రత్యేకించి కశ్మీర్, హిమాచల్ ప్రాంతాల్లో రోడ్లపై మంచు భారీగా పేరుకుపోతోంది.

9 /10

కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వర్షంతో పాటు మంచు కురుస్తుందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. అటు మైదాన ప్రాంతాల్లో కూడా చలి పెరగనుంది

10 /10

హిమాచల్ ప్రదేశ్ మంచు దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా, కులూ, మనాలీలో భారీగా మంచు కురుస్తోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.