Ar Rahman daughter khatija clarity: ఏఆర్ రెహమన్ నుంచి విడిపోతున్నట్లు ఆయన భార్య సైరా భాను ఇటీవల తన లాయర్ వందనాషాతో అఫిషియల్ డైవర్స్ అనౌన్స్ చేసిస విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతిరోజు వీరి డైవర్సీ అంశం ఏదో రకంగా వార్తలలో ఉంటుంది. ఆయన తన దగ్గర పనిచేసిన బాసిస్ట్ సింగర్ మోహినీడేతో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీన్ని మోహినీడేతో పాటు.. రెహమాన్ సైతం ఖండిచారు. తనకు రెహమాన్ తండ్రి వాడని మోహినీ డే స్పష్టం చేశారు.
మరోవైపు రెహమాన్ సతీమణి .. సైరాభాను సైతం.. తన భర్త మంచివాడని వీడియో రిలీజ్ చేసింది. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయోద్దని కూడా కోరింది. అయితే.. వీరి పిల్లలు సైతం.. తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించారలని అభిమానులను ఎక్స్ వేదికగా కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా, కొందరు రెహమాన్ ప్రస్తుతం డైవర్స్ తో చాలా డిస్టర్బ్ గా ఉన్నారని.. ఒక ఏడాది పాటు సంగీతానికి, సినిమాలకు బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నారంటూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.
దీంతో దీనిపై తాజాగా, రెహమాన్ కూతురు ఖతీజా క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి గురించి చేస్తున్న రూమర్స్ లో నిజంలేదని.. ఆయన సంగీతానికి ఏడాది పాటు బ్రేక్ ఇవ్వడం లేదంటూ కూడా పోస్ట్ పెట్టారు. దయచేసి లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చెందించవద్దని కూడా కోరినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెహమాన్ సైతం.. గతంలో ఫెక్ రూమర్స్ లపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. #Rc16(వర్కింగ్ టైటిల్).. రామ్ చరణ్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. దీనికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల ఫెక్ వార్తల పట్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తొంది. సైబర్ క్రైమ్ పోలీసులు, ఇతర అధికారులకు ఫిర్యాదులు కూడా చేసిన.. వీరి ఆగడాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook