Pushpa 2 the rule woman fans punakalu video: పుష్ప2 ది రూల్ ప్రస్తుతం అన్నిరికార్డులను తిరగ రాస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ లకు వెళ్తున్నారు. ముఖ్యంగా పుష్ప2 మూవీలో తిరుపతి గంగమ్మ జాతర హైలెట్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ జాతర ఈ మూవీకి ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ జాతర ఉన్న సీన్ లో.. అల్లు అర్జున్ చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం, పూనకంతో ఊగిపోవడం, ఆయన డ్యాన్స్ మాత్రం ఒక అదిరిపోయిందని చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా అల్లు అర్జున్ ఫెక్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్న ఆడియన్స్ మాత్రం, ఆయన నటనకు ఫిదా అవుతున్నట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, గూస్ బంప్స్ తెప్పిస్తున్న మ్యూజిక్ వింటుంటే.. థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా సీట్ల నుంచి నిలబడి మరీ బన్నీ నటనకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పునినట్లు వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/70sRDwgDAQ
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాలో ఈ గంగమ్మ జాతర సీక్వెల్.. బన్నీకి అమ్మవారు పూనీన సీన్ లను చూసి.. కొంత మంది మహిళలు సీట్లలో తమకు కూడా.. గంగమ్మ దేవత పూనీనట్లు ఊగిపోయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Read more: Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..
గతంలో అమ్మోరు, కాంతార సమయంలో కూడా .. థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర మ్యూజీక్ విని ఒళ్లంత జలదరించి.. పూనకాలు వచ్చినట్లు ఆడియన్స్ ఊగిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook