Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..

Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు  తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 6, 2024, 10:11 PM IST
  • తొక్కిసలాట ఘటనపై మాట్లాడిన అల్లు అర్జున్..
  • తమకు కలిచివేసిందని ఎమోషనల్..
Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..

Pushpa 2 movie Allu arjun reacts on Revathi stampede incident: పుష్ప2 మూవీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు మొదటి రోజు తన ఫెవరేట్ హీరో సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు.ఈ నేపథ్యంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర మాత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7).. అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ కు వచ్చినట్లు తెలుస్తొంది.

 

అప్పుడు.. చాలా మంది  ఒక్కసారిగా థియేటర్ లోకి ప్రవేశించడానికి గుమిగూడారు. అప్పుడు అనూహ్యంగా తోపులాట సంభవించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో రేవతి ఈ ఘటనలో చనిపోయినట్లు తెలుస్తొంది. మరోవైపు ఆమె కుమారుడు.. శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. తాజాగా.. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు.

పూర్తి వివరాలు..

అల్లు అర్జున్ తన అభిమాని కుటుంబం చనిపోవడం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తాము.. అభిమానుల కోసమే సినిమా తీస్తామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు.  ఈ ఘటన తెలిసినప్పటి నుంచి తాము.. ఏదో వెల్తీగా ఫీల్ అవుతున్నామన్నారు. సుకుమార్ సైతం..ఈ ఘటనపై బాధపడ్డారని చెప్పుకొచ్చారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. అందుకే ఎక్కడ సెలబ్రేషన్స్ జరిగిన కూడా.. అక్కడ యాక్టివ్ గా పాల్గొనలేకపోతున్నామన్నారు.  

అదే విధంగా తమ అభిమాని కుటుంబానికి జరిగిన నష్టం మాత్రం.. పూడ్చలేనిదని చెప్పారు. ఈ క్రమంలో రేవతి కుటుంబానికి కొంత ఆర్థికంగా తమ వంతుగా సహాయం చేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న బాబుకు అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.రేవతి కుటుంబానికి.. 25 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు.  తమతో ఇంకా ఎలాంటి సహాయం చేయడానికైన సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

Read more: Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ.. తొక్కిసలాట ఘటనపై షాకింగ్ విషయాలు బైటపెట్టిన మృతురాలి భర్త.. వీడియో ఇదిగో..

అభిమానులు సైతం.. సినిమాకు వచ్చేటప్పుడు కాస్తంతా జాగ్రత్తగా రావాలని, ఎంతైన ఆనందంగా వస్తారో.. అదే హ్యపీనెస్ తో తిరిగి ఇంటికి వెళ్లాలని కూడా అల్లు అర్జున్ కోరినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా..  హీరో అల్లు అర్జున్, ఆయన టీమ్ పై కేసు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News