EPFO: ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ అకౌంట్ ఇస్తారు. అయితే మరో కంపెనీకి వెళ్లాలి అనుకునట్లయితే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
EPFO: మీరు ఒక జాబ్ నుంచి మరొక జాబ్ కు మారినట్లయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక ముఖ్యమైన మార్గదర్శకాన్ని పాటించాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరో కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లయితే కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఈఫీఎఫ్ఓ తెలిపింది. యూఏఎన్ అనేది 12 అంకెల సంఖ్య. ఇది ఈపీఎఫ్ అకౌంట్ కు ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్ గా పనిచేస్తుంది.
మీకు రెండు మూడు యూఎఎన్ లు ఉంటే ఆ వివరాలను మీ ప్రస్తుత యూఏఎన్ తో వీలినం చేయడానికి ఒక ఈపీఎఫ్ అకౌంట్ సదుపాయాన్ని ఉపయోగించాలి. మీరు మీ ప్రస్తుత యూఏఎన్ పీఎఫ్ అకౌంట్ తో లింక్ చేసి ఉన్నట్లయితే మీరు ఉద్యోగం మానేసిన కంపెనీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును తీసుకోలేరు. దీనికోసం మీరు మీ పాత పీఎఫ్ అకౌంట్స్ ను కొత్త పీఎఫ్ అకౌంట్ తో లింక్ చేయాలి.
మీరు ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ లను కలిగి ఉన్నట్లయితే ఫారమ్ 13 ను ఆన్ లైన్లో సమర్పించాలి. తద్వారా మీ పాత యూఏఎన్ అకౌంట్ నుంచి ప్రస్తుత యూఏఎన్ కు మిగిలిన చెల్లింపు, సేవా వివరాలను ట్రాన్స్ ఫర్ అవుతాయి. మీ పర్సనల్ వివరాలు తప్పుగా ఉంటే లేదా పాత యూఏఎన్ లోని మీ ఆధార్ వివరాలతో సరిపోలనట్లయితే మీ వాటిని మీ పాత కంపెనీ నుంచి అప్ డేట్ చేయాలి. అప్ డేట్ తర్వాత మీ యూఏఎన్ ను ఆధార్ తో లింక్ చేయాలి. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే మీరు నేరుగా ఈకేవైసీ పోర్టల్ ద్వారా మీ యూఏఎన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు.
మీరు EPFO అధికారిక వెబ్సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ సందర్శించాలి .కుడి వైపున, ఉద్యోగుల ద్వారా డైరెక్ట్ UAN కేటాయింపుపై క్లిక్ చేసి మీ ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ రూపొందించుపై క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ పై వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ కంపెనీ, ఫ్యాక్టరీ, కంపెనీలో పనిచేస్తున్నారా. మీరు లేదు ఎంచుకుంటే మీ హోం పేజీకి వెళ్తారు. కింద కనిపించే జాబితా నుంచి ఉపాధి వర్గాన్ని సెలక్ట్ చేసుకోండి. EPFO క్రింద ఉపాధి కేటగిరీ స్థాపన/కంపెనీ/ఫ్యాక్టరీని సెలక్ట్ చేసుకుంటే. అది మిమ్మల్ని PF కోడ్ నంబర్‌ను ఎంటర్ చేయమని అడుగుతుంది.
ఇప్పుడు సిస్టమ్ లో మీ వివరాలను చూపుతుంది. అందులో మీరు ఉద్యోగం చేసిన తేదీని నమోదు చేసి, IDENTITY PROOOF TYPEని సెలక్ట్ చేసుకుని, IDENTITY PROOOF TYPE కాపీని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ లేదా వర్చువల్ ఐడీ & క్యాప్చా ఎంటర్ చేసి, జనరేట్ OTPపై క్లిక్ చేయాలి. మీ మొబైల్లో వచ్చిన OTPని ఎంటర్ చేసి..అప్పుడు సిస్టమ్ UIDAI నుంచి వివరాలు వస్తాయి. ఇప్పుడు REGISTER బటన్ పై క్లిక్ చేసి మీ UAN ఇప్పుడు జనరేట్ అవుతుంది. మీరు మీ మొబైల్లో UAN అందుకున్న మెసేజ్ కూడా వస్తుంది.