అందులో నుంచి మమత బెనర్జీ పేరు ఔట్.. .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ.  ఈ విషయం ఎవరినీ అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఐతే అలాంటి పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా .. ఆమె పేరు కచ్చితంగా అందులో ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉండి తీరాల్సిందే. 

Last Updated : Feb 13, 2020, 04:59 PM IST
అందులో నుంచి మమత బెనర్జీ పేరు ఔట్.. .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ.  ఈ విషయం ఎవరినీ అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఐతే అలాంటి పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా .. ఆమె పేరు కచ్చితంగా అందులో ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉండి తీరాల్సిందే. 

ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు సహా చాలా చోట్ల మమతా బెనర్జీ ఫోటోతోపాటు .. ఆమె పేరు కూడా తప్పకుండా ఉంటుంది. కానీ దీదీకి .. పశ్చిమ బెంగాల్ లోనే అవమానం జరిగింది. ఆమె పేరు లేకుండా ఓ ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. అవును.. ఇవాళ కోల్ కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా నిర్మించిన మెట్రో కారిడార్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. 4.88 కిలోమీటర్లు  నిర్మించిన ఈ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వేసిన ఆహ్వాన పత్రికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు లేదు. ఆమె ఈ కార్యక్రమానికి రావడం లేదు. ఐతే పశ్చిమ బెంగాల్ లో.. అందునా కోల్ కతాలో నిర్మించిన మెట్రో రైల్ కారిడార్  కు ఆమెను ఆహ్వానించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రోజూ స్వయంగా ఆమె ఆందోళనలకు దిగుతున్నారు. ఐతే మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడానికి .. ఇదేమైనా కారణమైందా..?  లేక పేరు మర్చిపోయారా..? అసలు తప్పిదం ఎక్కడ జరిగింది ..? అనేది తెలియాల్సి ఉంది. .

Trending News