Success Story: ఆడది తలచుకుంటే రాజ్యాలే కూలుతాయ్..రాత్రికి రాత్రే రాజ్యంగం మారిపోతుంది. ఆడవారు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక సాధారణ మహిళ..శక్తివంతురాలిగా మారి తన భర్తకు సీఎం పీఠం కట్టబెట్టేలా చేసింది. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా ఒకప్పుడు కల్పనా ముర్ము సోరేన్ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పార్టీలో కీలక నేతగా అన్నింటికి మించి భర్తకు తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసిన ధీర వనిత. అమెవరో కాదు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సతీమణి కల్పనా సోరెన్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Success Story: కల్పనా సోరేన్ అందరు అమ్మాయిల్లాగే..చదువు పూర్తవ్వగానే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సాధించాలని కల కన్నది. ఆమె స్వస్థలం ఒడిశాలోని మయూర్ భంజ్. పెరిగింది రాంచీలో. తండ్రి అంపా ముర్ము ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తనలో క్రమశిక్షణ, దేశభక్తికి అదే కారణమంటున్నారు కల్పనా సోరేన్. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలతో కలిసి పెరగడంతో అన్ని సంప్రదాయాల గురించే కాదు..వాటిని గౌరవించడం కూడా తెలుసుకున్నాని చెప్పుకొచ్చారు.
కల్పన ఇంజనీరింగ్ పూర్త చేయగానే పెళ్లి చేశారు. అత్తింటి వాళ్లది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం కావడం..భర్త హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు కావడంతో పెళ్లి తర్వాత కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కల్పనకు మాత్రమ బిజినెస్ మేనేజ్ మెంట్ చదవాలన్నది కోరిక. దూరవిద్య ద్వారా పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రెగ్నెంట్ గా ఉంది కూడా చదువుకున్నాని..ప్రసవానికి వెళ్లేలోపు ఎంబీఏ పూర్తి చేసినట్లు చెప్పారు. తన కలను నిజం చేసుకునేందుకు తనకు తోడుగా నిలిచిన తన కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.
అయితే కల్పన తండ్రి ఆర్మీలో పనిచేస్తే..తల్లి మాత్రం చదువుకోలేదు. గిరిజన భాష మినహా ఆమెకు హిందీ కూడా రాదు. అందుకే కల్పన ప్రతి మహిళా చదువుకోవాలని ఆశపడింది. గిరిజన అమ్మాయిలు చదువుకు సాయపడే కార్యక్రమాలను చేపట్టారు. విద్యాసంస్థలు ప్రారంభించడంతోపాటు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇద్దరు పిల్లలు, ఆదరించే కుటుంబం అంతా సంతోషం. ఆ సమయంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.
అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో ఓ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టు అయ్యారు. అప్పుడే రాజకీయాల్లోకి కల్పనా సోరేన్. తర్వాత సీఎం కల్పనా అన్నారు. రాజకీయాలు ఆమెకేం తెలుసుక అన్నా ధైర్యంగా ముందడుగు వేశారు. 31 జనవరి 2024 రాత్రి రాంచీలోని ఈడీ కార్యాలయం వెలుపల కల్పనా సోరెన్ ముఖం మొదటిసారిగా మీడియాలో వెలుగు చూసింది. కొద్ది గంటల క్రితం భూ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తన భర్త హేమంత్ సోరెన్‌కు ఆహారం, మందులతో కల్పన ఇక్కడికి చేరుకుంది.
ఈ సంఘటన జరిగిన సుమారు 300 రోజుల తర్వాత, అంటే 23 నవంబర్ 2024న, రాంచీ విమానాశ్రయం నుండి కల్పన మరొక చిత్రాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పంచుకున్నారు. 'మా స్టార్ క్యాంపెయినర్‌కు స్వాగతం' అని రాస్తూ కల్పన చిత్రాన్ని షేర్ చేశాడు హేమంత్. దీంతో విజయంపై మీడియా సమావేశం పెట్టేందుకు వచ్చిన హేమంత్ సోరెన్.. కల్పనను తన పక్కన కూర్చోబెట్టాడు. ఈ స్టెప్‌తో హేమంత్ పార్టీలోనూ, బయటా పెద్ద సందేశం ఇచ్చాడని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
చీరకట్టు..ముఖంపై చిరునవ్వు..కల్పనా సోరెన్ ప్రత్యేకత. ఒడియా, బెంగాళీ, ఇంగ్లీష్, హిదీ భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది. తనని కలవాలంటూ వచ్చినవారిని వాళ్లకు వచ్చిన భాషలోనే పలకరిస్తారు. నేనూ గిరిజన వ్యక్తినే మీలో ఒకరినే అంటూ వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. తన భర్త తరపున రాష్ట్రమంతా ర్యాలీలు, సభలు నిర్వహించారు.
తన భర్త జైలుకు వెళ్తే అత్తింటివారంతా కన్నీళ్లు పెట్టుకుంటే..తాను మాత్రం ధైర్యంగా నిలవాలకుంది. అన్నట్లుగానే జనాల్లోకి వెళ్లింది. తన కన్నీరు తుడుచుకుంటూ ప్రజలతో మమేకం అయ్యింది. కుటుంబ బాధ్యతలతోపాటు మమగారు అందించిన పార్టీ బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించారు. ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో కల్పన గాండేయ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తొలిసారి భారీ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల మన్ననలను గెలుచుకున్నారు.
జైలు నుంచి తన భర్త బయటకువచ్చిన తర్వాత కూడా కల్పనా సమావేశాలు ఆపలేదు. కొన్ని చోట్ల కల్పనను సభపెట్టమని జనమే అడిగేవారంటే అమెకున్న క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని అవాంతరాలొచ్చిన తిరిగి తాజా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. భర్త తిరిగి విజయం సాధించేలా చేశారు.
కల్పనా ప్రయాణాన్ని చూసినవాంతా ఇల్లాలి విజయం ఇది..హేమంత్ సోరెన్ ఇన్నేళ్లలో సాధించినదాన్ని కల్పన ఒక్క ఏడాదిలో తిరిగి నిర్మించారంటూ ప్రశంసిస్తున్నారు. అందుకే ఇప్పుడు కల్పన సోరెన్ సీఎం భార్య మాత్రమేకాదు ఓ మహిళా శక్తిగా ఎదిగారు. అందుకే అంటారు ఇల్లాలే ఇంటికి దీపం. ఆ దీపం సరిగ్గా ఉన్నంత సేపు ఆ ఇంటికి ఆనందం.