Zodiac Signs Made For Each Other: పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయి అంటారు. నూరేళ్లు, ఏడు అడుగులు, రెండు జీవితాలు. అయితే, కొంతమంది పెళ్లి అయిన కొన్ని రోజులకే పెటాకులు అవుతాయి. ఈ కాలంలో డివోర్స్ కూడా ఎక్కువ అయ్యాయి. అయితే, కొన్ని రాశులవారు పెళ్లి చేసుకుంటే కలకాలం కలిసి ఉంటారట. ఎప్పటికీ విడిపోరు, వీళ్లు శివపార్వతుల జంటలా మెలుగుతారు. వీరు కలిసి నిర్ణయం తీసుకుంటూ వైవాహిక జీవితంలో కొనసాగుతుంటారు.
రాశిచక్రం ప్రకారం కెరీర్, ఒక వ్యక్తి లక్షణాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని రాశులు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు. వారి దాంపత్యం అన్యోన్యంగా మెలుగుతుంది.
మిథున రాశి, ధనస్సు.. మిథున రాశి, ధనస్సు రాశివారు పెళ్లి చేసుకుంటే జీవితం కలకాలం హాయిగా సాగిపోతుంది. ఓ కమిట్మెంట్తో ముందుగు సాగుతారు. ఈ రాశివారు ఉత్తమ జంటగా చూసిన వారికి కూడా కనిపిస్తారు.
వృషభం- కర్కాటక రాశి.. రాశిచక్రాల ప్రకారం ఈ జంట కలకాలం మెలుగుతుంది. కర్కాటక రాశివారికి సున్నిత మనస్తత్వం కలవారు. వృషభ రాశివారితో వీరి వివాహం జరిగితే అన్యోన్యంగా కలిసి ఉంటారు.
మేష- వృశ్చికం.. ఒకరికి కోపం ఎక్కువైతే మరొకరు శాంత స్వరూపులు. ఈ రెండు జంటలు కలిస్తే శివపార్వతుల జంట వంటిది. ఈ రాశివారు పెళ్లి చేసుకుంటే కూడా ఎప్పటికీ విడిపోరు.
రాశిచక్రాల ప్రకారం ఈ జంటలు ఇతరులకు ఓ ఆదర్శ దంపతుల్లా కనిపిస్తారు. అలాగే మెలుగుతారు. ఈ కాలంలో ఎక్కడో అక్కడ ఆదర్శ దంపతులు ఉన్నారా? అంటే వాళ్లు ఈ రాశివాళ్లే...