హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ, కొత్తవారికి పోస్టింగ్ చేశారు. ఒకేసారి ఏకంగా 56 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగియడంతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) 21 జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆయనకు నీటిపారుదలశాఖ బాధ్యతలు అప్పగించింది. త్వరలో మరికొంత మంది బదిలీలు ఉంటాయని సైతం సూచించడం గమనార్హం.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హన్మంతు, మేడ్చల్ కలెక్టర్‌గా వి. వేంకటేశ్వర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శిగా వికాస్ రాజ్, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్ర రామచంద్రన్‌కు అదనంగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు, వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్ధన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్‌రాస్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా దివ్యకు బాధ్యతలు అప్పగించారు.
కలెక్టర్లు - బదిలీ, పోస్టింగ్
హైదరాబాద్ - శ్వేతా మహంతి
వరంగల్ అర్బన్ - రాజీవ్‌గాంధీ హన్మంతు
మేడ్చల్ - వి. వేంకటేశ్వర్లు,
సూర్యపేట - టి. వినయ్ కృష్ణారెడ్డి,
ఆసిఫాబాద్ - సందీప్ కుమార్ ఝా
పెద్దపల్లి - సిక్త పట్నాయక్
ములుగు - ఎస్. కృష్ణ ఆదిత్య
నిర్మల్ - ముషారఫ్ అలీ
ఆదిలాబాద్ - దేవసేన
మహబూబాబాద్ - వీపీ గౌతమ్
జగిత్యాల - జి. రవి
జనగామ - కె నిఖిల
వనపర్తి - ఎస్.కె. యాస్మిన్ బాషా
మహబూబ్‌నగర్ - ఎస్. వెంకటరావు
జోగులాంబ గద్వాల - శృతి ఓజా
కామారెడ్డి - శరత్
జయశంకర్ భూపాలపల్లి - అబ్దుల్ అజీమ్
వికారాబాద్ - పౌసుమీ బసు
భద్రాద్రి కొత్తగూడెం - ఎం.వీ.రెడ్డి
నారాయణపేట్ - హరిచందన దాసరి