Maharashtra Election Result: కాంగ్రెస్ అబద్ధాల ప్రచార సమితి.. నిదర్శనమే మహారాష్ట్ర గెలుపు: కేంద్ర మంత్రి

Maharashtra Election Result: ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో విజయం సాధించడం ఎంతో ఆనందకరమని కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడి ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని మరీ గెలిపించుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎన్నో చెడు ప్రచారాలు చేసినప్పటికీ ప్రజులు పట్టించుకోలేదన్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 23, 2024, 05:15 PM IST
Maharashtra Election Result: కాంగ్రెస్ అబద్ధాల ప్రచార సమితి.. నిదర్శనమే మహారాష్ట్ర గెలుపు: కేంద్ర మంత్రి

Maharashtra Election Result: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయమన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ..ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని బీజేపీని గెలిపించుకున్నరన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందినప్పటికీ విఫలమైందని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయిన తర్వాత వన్ సైడ్ విక్టరీ ఒక పార్టీకి, ఒక అలయెన్స్‌కు రావడం తొలిసారి ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కులం, మతం, భాష పేరుతో అనేక రకాలుగా గురివింద గింజ సామెతగా అన్ని రకాల నష్టాలకు కారణమైందన్నారు. రాహుల్ గాంధీకి ఈ మధ్యలో మతిమరుపు ఎక్కువైందని.. బీజేపీయే దేశంలో అన్ని కారణాలకు కారణమవుతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల, చిలక పలుకులు, గురివింద గింజ కామెంట్లను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు.

జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కలిపితే మొత్తం కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా దాటలేదని.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. భాష, కులం, మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్ర ఎన్నికల్లో రాజ్యాంగాన్ని చేత పట్టుకుని విష ప్రచారం చేసినప్పటికీ..కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు నమ్మలేదన్నారు.

మహారాష్ట్రలో వరుసగా మూడోసారి అధికారంలోకి బీజేపీ వచ్చిందని.. గత టర్మ్‌లో ప్రజల అభీష్టం మేరకు బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకున్ని ఎన్నికలకు వెళ్లిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టిన తెలంగాణ, కర్ణాటక, గ్యారెంటీల పేరుతో మునిగిపోయిన హిమాచల్ ప్రదేశ్ లోనే కాంగ్రెస్ అధికారంలోనే ఉందని..మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే చాలా నవ్వొస్తోందన్నారు. అధికారంలోకి రాకముందే ఎమ్మెల్యేలను తరలించేందుకు 4 విమానాలను కాంగ్రెస్ రెడీ చేసుకోవడం నవ్వుపుట్టించిదన్నారు.

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

కానీ ప్రజలు ఆలోచన, నాడిని కాంగ్రెస్ పసిగట్టలేక మరోసారి నవ్వుల పాలయిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన రాహుల్ గాంధీతో కలిసి, బాల్ ఠాక్రే సిద్ధాంతాలు, స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లి తూట్లు పొడిచిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పోవడంతో ప్రజలంతా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు షాకిచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదని..ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదని తెలిపారు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు ఓడిపోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారన్నారు.

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News