Bank Holiday in December 2024: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే భద్రంగా ఉంటాయని చాలామంది నమ్మకం. అంతేకాదు వారి జీతాలు కూడా ప్రతినెలా బ్యాంకుల్లోనే క్రెడిట్ అవుతాయి. ప్రభుత్వరంగ పథకాలు కూడా కేవలం బ్యాంకు ద్వారానే అమలు చేస్తాయి. అయితే, డిసెంబర్ నెలలో కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. కేవలం 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బ్యాంకుల ద్వారా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తాం. అయితే, బ్యాంకులకు వెళ్లే ముందు ముందుగా వాటి పని దినాలు కూడా మీరు తెలుసుకుని ఉండాలి. లేకపోతే మీ పనులు నిలిచిపోతాయి. డిసెంబర్ మాసంలో ఎన్ని రోజులపాటు బ్యాంకులు బంద్ ఉంటాయో తెలుసా?
2024 డిసెంబర్ 1.. డిసెంబర్ 1న బ్యాంకులు పనిచేయవు ఎందుకంటే ఆరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఇక డిసెంబర్ 3వ తేదీ సెయింట్ ఫ్రాన్సీస్ జేవియర్ ఫెస్టివల్ సందర్భంగా ఆరోజు కూడా బ్యాంకులు బంద్.
8వ తేదీ రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు ఆరోజు సెలవు. డిసెంబర్ 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం, యూనిసెఫ్ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 11వ తేదీ కూడా బంద్ ఉండనున్నాయి.
డిసెంబర్ 14న రెండో శనివారం, 15 ఆదివారం మరో రెండు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక 18వ తేదీ గురు ఘాసిదాస్ జయంతి సందర్భంగా ఆరోజు చంఢీగఢ్‌లో బ్యాంకులు పనిచేయవు. డిసెంబర్ 19న గోవా లిబరేషన్ డే సందర్భంగా పనాజీలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
డిసెంబర్ 22 ఆదివారం కాబట్టి బ్యాంకులు క్లోజ్. 24వ తేదీ గురు తేజ్ బహదూర్ బలిదానం ఇచ్చిన రోజు కాబట్టి ఈరోజు మేఘాలయా, మిజోరాం, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
ఇక డిసెంబర్ 25 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోజు క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే, మరుసటి రోజు 26వ తేదీ బాక్సింగ్ డే కాబట్టి ఆరోజు కూడా సెలవు కలిసి వస్తుంది.
డిసెంబర్ 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులు బంద్ ఉంటాయని తెలిసిందే. 29వ తేదీ ఆదివారం. అయితే, డిసెంబర్ 30వ తేదీన టాము లోజర్ అనే బుద్దా ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. మిజోరామ్‌లో డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.