Naga Chaitanya Shobitha Wedding: నాకు బిగ్‌ రిలీఫ్.. శోభిత- నాగచైతన్య పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన నాగార్జున..!

Nagarjuna On Naga Chaitanya Shobitha Wedding: నాగ చైతన్య, శోభితల వివాహాం అతిత్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తండ్రి, హీరో నాగార్జున వీరి వివాహాంపై ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్‌ 4న జరగనుందని తెలుసు. ఇటీవలె వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్‌ కార్డు కూడా నెట్టింట వైరల్‌ అయింది. ఆ పెళ్లిపత్రికలో శోభిత పేరు 'లక్ష్మి శోభిత' అని ఉంది.  

2 /6

అయితే, అక్కినేని నాగార్జున వీరి పెళ్లిపై ఓ ప్రకటన చేశారు. వాళ్లిద్దరి కోరిక మేరకు కేవలం సింపుల్‌గానే పెళ్లి జరగనుంది. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే డిసెంబర్‌ 4 జరగనుందని ప్రకటించారు.   

3 /6

నాగచైతన్య శోభితలు కూడా సింపుల్‌గా వివాహాం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి కేవలం 400 మంది బంధువులు, సినిమా ఇండస్ట్రీ, సన్నిహితుల నడుమ జరగనుందని, వారిని మాత్రమే ఆహ్వానించామని ప్రకటించారు.   

4 /6

నాగచైతన్య శోభితలు సింపుల్‌ వెడ్డింగ్‌ కోరుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు కూడా వారికే వదిలేశాను, నాకు కూడా బిగ్‌ రిలీఫ్‌ అని చెప్పారు. ఇదిలా ఉండగా పెళ్లిరోజు శోభిత కాంజీవరం సిల్క్‌ చీరను ధరించనుంది. తన తల్లితోపాటు ఈ సంప్రదాయమైన చీరను ఎంపిక చేసుకుంది.  

5 /6

వీటితోపాటు పొందూరులో నేసిన ఖాదీ చీర చైతన్య డ్రెస్‌తో మ్యాచ్‌ అయ్యే విధంగా ధరించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా నెట్టింటా వైరల్‌ అయింది. అయితే, పెళ్లికి ముందు శోభిత చేసిన కొన్ని ఫోటోషూట్లు కూడా వైరల్‌ అవుతున్నాయి.  

6 /6

ఇక నాగచైతన్యకు ఇది రెండో వివాహం. మొదట హిరోయిన్‌ సమంత రూత్‌ ప్రభును 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.