తిరువంతపురం: చైనా దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షలు చేయగా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారతదేశం కరోనావైరస్ కు సంబంధించిన మొదటి కేసును గురువారం కేరళ రాష్ట్రంలో గుర్తించారు.
చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్తినికి కరోనావైరస్ సోకినట్లు కేరళలో నివేదించబడింది. ప్రస్తుతానికి కరోనా వైరస్ సోకిన విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని, ఐసోలేషన్ లో ఉంచామని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే . కే శైలజా తెలుపుతూ, ఇదే అంశంపై అత్యవసర సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశామన్నారు.
అంతర్జాతీయంగా భయంకరంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. చైనా నుండి వచ్చే ప్రయాణికులపై , చైనాకు వెళ్లే ప్రయాణికులపై ఈ లక్షణాలూన్న వారిపై వెంటనే అప్రమత్తం కావాలని తెలియజేస్తోంది.
JUST IN: India also confirmed their first case of the novel #coronavirus. The person is a student from Kerala.
Development in the Philippines: DOH said that the patient positive with 2019-ncoV is in a hospital in Manila (via GMA News). pic.twitter.com/d9u5NSdYHs
— EarthShakerPH (@earthshakerph) January 30, 2020
కేరళ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో మొదటి కేసును గుర్తించడంతో రాష్ట్రం, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో చేరిన ముగ్గురు గురువారం కరోనావైరస్ నిర్దారిత పరీక్షలు చేయగా, నెగెటివ్ అని తేలగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నాడు ఈ ముగ్గురిని శ్వాసకోశ, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వీరిని అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. ఈ ముగ్గురు వరుసగా 24, 34, 48 సంవత్సరాల వయస్సులో ఉన్నారని, ఒకరు విద్యార్థి కాగా, మిగతా ఇద్దరు చైనాకు చెందిన తమ వ్యాపార పనులపై వచ్చారని, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి భరద్వాజ్ తెలిపారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చైనాకు ప్రయాణించకుండా ఉండమని, ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ముఖ్యమైన సూచన చేసింది. చైనాలోనో వుహాన్ నగరం కోటికిపైగా జనాభా కలిగి ఉంది. ఇక్కడ మొదలైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.
కరోనావైరస్, 11 మిలియన్లకు పైగా జనాభా కలిగిన చైనా నగరమైన వుహాన్లో ఉద్భవించిందని, అప్పటి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాపించింది. ఈ కరోనా వైరస్ కారణంగా 170 మంది మరణించగా, చైనాలో మాత్రమే 1700 కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న ఈ మహమ్మారిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, చైనాతో పాటు అనేక ఆసియా దేశాలలోకరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆయా దేశాల అధికారులు తెలియజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..