ట్రంప్ రాజీనామా అంటూ తప్పుడు ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ఓ ట్వీట్ కు పెంటగాన్ రక్షణ శాఖ రీట్వీట్  చేయడంతో గందరగోళం నెలకొంది.

Last Updated : Nov 23, 2017, 07:37 PM IST
 ట్రంప్ రాజీనామా అంటూ తప్పుడు ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు అమెరికా పెంటగాన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఒక చిన్న పొరపాటు కారణంగా ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ట్వీట్ కు రక్షణ శాఖ పెంటగాన్ రీట్వీట్ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నెటిజన్లు కామెంట్లు చేశారు.

లైంగిక వేధింపుల కారణంగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఉన్న ఓ ట్వీట్ ను పెంటగాన్ పొరపాటుగా రీట్వీట్ చేసింది. అది గమనించిన అధికారులు వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. అప్పటికే అది నెటిజన్ల కంటపడటంతో ట్వీట్ వైరల్ అయ్యింది. ఇలా చేయడం పెంటగాన్ కు కొత్త కాదండోయ్..! మొన్నీమధ్య 'అమెరికా అణ్వాయుధాలను దాచి పెడుతోంది. గాల్లో అణుబాంబులను వదులనుంది' అని ట్వీట్ చేసింది. జరిగిన తప్పుకు పైఅధికారులకు సంజాయిషీ చెప్పుకోలేక నానా తంటాలు పడ్డారు. 

 

 

Trending News