Ram Pothineni marriage : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్ గా.. పేరు తెచ్చుకున్న హీరోలలో ఒకరు రామ్. దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. ఈ హీరో ఆ తరువాత ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యారు. ఇక ఇప్పుడు ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.
2006లో దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రామ్. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు ఈ హీరో. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించింది.
ఇక దేవదాసు చిత్రం తరువాత మరెన్నో సినిమాలలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చాక్లెట్ బాయ్ పేరు సంపాదించుకున్నారు. అయితే రామ్ చూడడానికి క్లాస్ గా ఉన్న.. మాస్ సినిమాలు సైతం చేసి.. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
కాగా కొద్ది రోజుల నుంచి మాత్రం ఈ హీరోకి వరస డిజాస్టర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో.. వరసగా రెండు విజయాలు అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత నుంచి ఫ్లాపుల బారిన పడ్డారు.
ది వారియర్, స్కంద, డబల్ ఇస్మార్ట్ చిత్రలతో.. వరసగా మూడు ఫ్లాపులు అందుకున్నారు ఈ హీరో. ఇక త్వరలో తన 22వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో మూడు పదుల వయసు దాటిన రామ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ వయసు 36 సంవత్సరాలు. ఇక ఆయన వయసు గల హీరోలు అందరికీ ఇప్పటికే పెళ్లయిపోవడంతో.. రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ఎంతోమందిలో అనుమానం కలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. అయితే ఆ అమ్మాయిది సినీ బ్యాక్ గ్రౌండ్ కాదని.. తనకి కొద్ది సంవత్సరాల నుంచి స్నేహితురాలుగా మెలుగుతున్న ఒక అమ్మాయిని తెలుస్తోంది.
ఇక ఈ అమ్మాయితో వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని. వీరిద్దరి నిశ్చితార్థం.. వచ్చే సంవత్సరం మొదట్లో జరగచ్చని వినికిడి.