TTD News: నిరుద్యోగులకు బంపర్ జాక్ పాట్... టీటీడీలో భారీగా ఉద్యోగాల జాతర.. నోటిఫికేషన్ విడుదల..

Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం ఆనందంలో ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం పోటీ కూగా బాగా ఉన్నట్లు సమాచారం.
 

1 /6

తిరుమల తిరుపతి దేవ స్థానంలో ఇటీవల కొత్త పాలక మండలి ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిలో బీఆర్ నాయుడు చైర్మన్ గాను, మరో 25 మందితో బొర్డును ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ముఖ్యంగా..టీటీడీ ఆధ్వర్యంలో  నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌ లో కాంట్రాక్ట్ ప్రాతికన మెడిసిన్ రంగంలో పోస్టులకు ధరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తొంది. వీటిలో పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అనస్తటిస్ట్‌, పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

2 /6

మరోవైపు టీటీడీ వాటర్ అండ్ పుడ్ ల్యాబోరేటరీలో ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుస్తొంది. హెచ్ వోడీ, క్వాలీటీ మెనెజర్ పోస్టుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సమాచారం.   

3 /6

కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, పుడ్ సెఫ్టీ, పుడ్ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం పదేళ్ల పాటు పని చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండాలని నోటిఫికేషన్ చెప్పినట్లు తెలుస్తొంది.

4 /6

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.  పూర్తి చేసిన తర్వాత మార్కెటింగ్ గోడాన్ ఫస్ట్ ఫ్లోర్, గోశాల పక్కన, తిరుమల- 517504 చిరునామాకు పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

5 /6

 నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు సమాచారం. ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌, నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

6 /6

అదే విధంగా.. అర్హత, ఆసక్తి ఉన్న హిందు మతానికి చెందిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 15 దరఖాస్తులకు చివరితేదిగా సూచించారు. నిరుద్యోగ అభ్యర్థులు పూర్తి వివరాలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ చూడాలని చెప్పారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x